తెలంగాణ

telangana

రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికే పేపర్ లీక్​ : బీఆర్ఎస్ నేతలు

By

Published : Apr 5, 2023, 2:10 PM IST

BRS reaction on Bandi sanjay arrest : కరీంనగర్​ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై బీఆర్​ఎస్​ నాయకులు స్పందించారు. పేపర్​ లీకేజ్​ కేసులో సంజయ్ ప్రమేయం ఉందని ఆరోపంచారు. ఈ కేసులో ఎలాంటి వ్యక్తులు నిందితులుగా ఉన్నా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు.

BRS leaders reacted to Bandi Sanjay arrest
బండి సంజయ్​ అరెస్ట్​పై స్పందించిన బీఆర్​ఎస్​ నాయకులు

BRS reaction on Bandi sanjay arrest : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కరీంనగర్​ జిల్లాలో పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు. సంజయ్ అరెస్టు గల కారణంపై మాట్లాడుతూ.. బీజేపీ కుఠిల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ​ కేసులో బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో కమలం నేతలు చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.

Balka Suman on bandi Sanjay Arrest : రాష్ట్రంలో అభద్రతా భావం సృష్టించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌.. ఒక బీజేపీ కార్యకర్త అని పేర్కొన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ప్రశాంత్​ ఆ పార్టీ ప్రముఖ నేతలతో సన్నిహితంగా ఉండేవాడని చెప్పారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి దిల్లీలో వ్యూహాలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్‌షా, సునీల్‌ బన్సల్‌ నేతృత్వంలో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

Gangula on bandi Sanjay Arrest: 'రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి లీకేజ్​లు జరగలేదు. ఈ సంవత్సరం ఎన్నికల ఉన్నందున బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. టీఎస్​పీఎస్సీ, పదో తరగతి పేపర్​ లీకేజీ​లో బీజేపీ నాయకుల ప్రమేయం ఉందని అనుమానంగా ఉంది. యువతను తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. స్వార్థ రాజకీయాలతో బీజేపీ యువత గొంతు కోస్తోంది. రాష్ట్రంలో అధికారం సాధించాలనే ఇలాంటి పనులు చేస్తోంది. లీకేజీ కేసుల్లో ఎంతటి వారినైనా ప్రభుత్వం శిక్షిస్తుంది.' అని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.

bandi Sanjay Arrest in SSC Paper Leak : రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారిని ఇబ్బంది పెట్టేందుకే ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. మరోవైపు..బీజేపీ అంటేనే బురద జల్లే పార్టీ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. పేపర్​ లీకేజ్​ వ్యవహారంలో బీజేపీ నాయకుల హస్తం ఉందని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్రలో ఏ1 బండి సంజయ్‌ అని తీవ్ర ఆరోపణలు చేశారు.

పదో తరగతిప్రశ్నాపత్రం బయటకు తీసుకువచ్చి, ఫొటో తీయించి మీడియాకు ఇచ్చింది బండి సంజయ్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఉంటే ఓట్ల సమయంలో చూసుకుందామని.. విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే పనులు చేయడం తగదని హితవు పలికారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details