తెలంగాణ

telangana

A Thief Request Letter in Bank : 'ఒక్క రూపాయి కూడా దొరకలేదు.. గుడ్​ బ్యాంక్​.. నన్ను పట్టుకోవద్దు'

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 9:41 PM IST

A Thief Request Letter in Bank in Mancherial : దొంగలు డబ్బులు, బంగారం ఎత్తుకుపోవడం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ దొంగ తను దొంగలించడానికి వచ్చిన బ్యాంకు​పై ప్రశంసలు కురిపించాడు. పని ముగించుకుని వెళ్తూ వెళ్తూ.. మంచి బ్యాంకు అంటూ ఓ కాగితంపై రాసి వెళ్లాడు. హాఁ.. ఏముందిలే.. 'డబ్బులు బాగా దొరికి ఉంటాయి.. అందుకే అలా రాసి ఉంటాడు' అని అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. అసలు అతడు అలా ఎందుకు రాశాడో.. ఏం రాశాడో తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోకమానరు. అసలు సంగతి ఏంటంటే..?

A Thief request letter in bank in mancherial
A Thief request letter in bank

A Thief Request Letter in Bank in Mancherial: రోజురోజుకూ మంచిర్యాల జిల్లాలో వరుస దొంగతనాలు కలవరం రేపుతున్నాయి. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అరెస్టులు చేసినా దొంగల తీరు మాత్రం మారడం లేదు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా నెన్నెల మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో ఒక వింత దొంగతనం చోటుచేసుకుంది. దొంగలు డబ్బులు, బంగారం ఎత్తుకుపోవడం మనం చూసుంటాం. ఇక్కడ మాత్రం ఓ దొంగ తను దొంగలించడానికి వచ్చిన బ్యాంక్​పై ప్రశంసలు కురిపిస్తూ కాగితంపై రాసి వెళ్లాడు.

Thief Attack on Woman In Vemulawada : అట్లుంటది మరి ఆడవాళ్లతో పెట్టుకుంటే.. భయంతో పరుగులు తీసిన దొంగ

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని దొంగ దోపిడీకి యత్నించాడు. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లాడు. లాకర్ గదిలోకి చొరబడటానికి అవకాశం దక్కకపోవడంతో చోరీ జరగలేదు. బ్యాంకులో దొంగతనానికి వచ్చిన దొంగకు.. బ్యాంకు మొత్తం వెతికినా ఏమీ దొరకలేదు. దీంతో బ్యాంకులో ఎలాంటి నగదు చోరీ కాలేదు. డబ్బులు లేకపోవడంతో నిరాశకు గురైన ఆ దొంగ.. అక్కడే ఉన్న ఓ మార్కర్​ తీసుకుని పేపర్​పై ఓ 'గమనిక' రాశాడు.

3 కమిషనరేట్లు.. 23 దొంగతనాలు.. బ్రూస్లీ కన్నుపడితే ఇళ్లు ఖాళీ

ఎంతో కష్టపడి, ఎన్నో ప్లాన్​లు వేసుకుని బ్యాంకు దొంగతనానికి వస్తే.. రూపాయి కూడా దొరకకపోవడంతో 'గుడ్ బ్యాంకు.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు.. నన్ను పట్టుకోవద్దు.. నా వేలి ముద్రలు కూడా ఉండవు' అని కాగితంపై రాసి పెట్టి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం విధులకు వచ్చిన బ్యాంకు ఉద్యోగులు ఆ దొంగరాసిన నోట్ చదివి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని బ్యాంకు ఉద్యోగులు స్థానిక పోలీసులతో పంచుకున్నారు.

Theft in Temples: దేవాలయాల్లో దొంగతనాలు.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​

అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను గుర్తించకుండా దొంగ జాగ్రత్త పడినప్పటికీ.. బ్యాంకు సీసీ కెమెరాలో దొంగతనానికి అతను ప్రయత్నించిన ఫుటేజీ మాత్రం రికార్డైంది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ఎవరైనా ఊర్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని.. నగదు, డబ్బును వెంట తీసుకొని వెళ్లాలని చెప్పారు. ఈ ఘటన తర్వాత బ్యాంకు భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏదేమైనా దొంగ రాసిన నోట్​పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Mobiles robbery in Adilabad : మొబైల్ షాప్​లో దొంగతనానికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులు

Cheddi Gang Halchal in Miyapur : నగరంలో మళ్లీ చెడ్డీగ్యాంగ్​ కలకలం.. మియాపూర్​లో భారీ చోరీ

ABOUT THE AUTHOR

...view details