Chain Snatching At Hayatnagar : ఒంటరిగా షాప్​కు వెళ్లితే.. పుస్తెలతాడు చోరీ

By

Published : Jun 1, 2023, 8:23 PM IST

Updated : Jun 1, 2023, 8:47 PM IST

thumbnail

Chain Thieft In Hyderabad : హైదరాబాద్​ నగరంలో ఇంకా చైన్​ స్నాచింగ్​ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన.. గొలుసు దొంగలను ఆపలేకపోతున్నారు. తాజాగా హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో నందిని హిల్స్​కు చెందిన మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించిన చైన్​ దొంగ​ ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకొని పోయారు. 

ఆమె షాపు నుంచి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు ఆమె మెడలోని బంగారు తాడుతో ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. హయత్​ నగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బ్లాక్​ కలర్​ హోండా షైన్​ ద్విచక్ర వాహనంపై వచ్చి.. బ్లూ కలర్​ టీ షర్ట్​ ధరించి హెల్మెట్​ పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి హయత్​నగర్​లోని వీరన్న గుట్ట వైపు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Jun 1, 2023, 8:47 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.