తెలంగాణ

telangana

Australian Open 2022: రఫేల్​దే టైటిల్.. పోరాడి ఓడిన మెద్వెదెవ్

By

Published : Jan 30, 2022, 7:49 PM IST

Updated : Jan 30, 2022, 8:01 PM IST

Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్​ ఫైనల్​లో గెలిచి టైటిల్​ కైవసం చేసుకున్నాడు రఫేల్ నాదల్. చివరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో మెద్వెదెవ్​ను ఓడించాడు.

rafale nadal
రఫేల్ నాదల్

Australian Open 2022: స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రఫ్పాడించి సరికొత్త చరిత్రను లిఖించాడు. జకోవిచ్‌, రోజర్ ఫెదరర్‌లను కాదని టెన్నిస్‌ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌తో నాదల్‌ గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 21కి చేరింది. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే రఫేల్ నాదల్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకోవడం విశేషం. సీనియర్‌ ప్లేయర్‌ అయిన నాదల్‌ ముందు మెద్వెదెవ్‌ నిలవలేకపోయాడు.

రఫేల్ నాదల్

ఆఖరి సెట్‌వరకూ హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రఫేల్‌ నాదల్ విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లో రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 21వ గ్రాండ్‌స్లామ్‌ గెలుచుకోవడం విశేషం. తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్‌.. ఆఖరి మూడు సెట్లలో అసమాన పోరాటం కనబరిచి విజయం సాధించడంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

మెద్వెదెవ్

తొలి సెట్‌ను మెద్వెదెవ్‌ దూకుడుగా ఆడి 6-2 తేడాతో గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో నాదల్‌ తీవ్రంగా పోరాడినా 6-7తో మెద్వెదెవ్‌ విజయం సాధించాడు. వరుసగా రెండు సెట్లను కోల్పోయిన నాదల్‌ ఎక్కడా తగ్గలేదు. తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి చివరి మూడు సెట్లలో (6-4, 6-4, 7-5) విజయం సాధించి రికార్డు నమోదు చేశాడు. ఇద్దరూ చెరో రెండు సెట్లను గెలవడంతో మ్యాచ్‌ ఐదో సెట్‌కు వెళ్లింది. అయితే అక్కడా మెద్వెదెవ్ పట్టువిడవకపోవడంతో నాదల్‌ కాస్త శ్రమ పడాల్సి వచ్చింది. ఓ వైపు గాయం నొప్పి వెంటాడుతున్నా ఏమాత్రం లెక్క చేయక దాదాపు ఐదున్నర గంటలపాటు పోరాడటం విశేషం.

Last Updated :Jan 30, 2022, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details