ETV Bharat / sports

14 ఏళ్లకే మహిళల సింగిల్స్ టైటిల్.. యంగెస్ట్ ఇండియన్​గా గుర్తింపు

author img

By

Published : Jan 30, 2022, 5:21 PM IST

Odisha Open: ఒడిశా ఓపెన్​లో హరియాణాకు చెందిన టీనేజర్ ఉన్నతి హుడా అరుదైన ఘనత సాధించింది. ఉమెన్స్​ సింగిల్స్​లో గెలిచిన పిన్న వయసు భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

odisha open
ఒడిశా ఓపెన్

Odisha Open: ఒడిశా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్​ టోర్నీలో హరియాణాకు చెందిన ఉన్నతి హుడా(14) సంచలనం సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్​ సూపర్ 100 టోర్నీ గెలిచిన పిన్న వయసు భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

ఆదివారం జరిగన మ్యాచ్​లో 21 ఏళ్ల తోష్నివాల్​ను 21-18, 21-11 తేడాతో ఓడించి ఒడిశా ఓపెన్ ఉమెన్స్​ సింగిల్స్ టైటిల్​ కైవసం చేసుకుంది.

మరోవైపు మహిళల డబుల్స్​లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జంట విజయం సాధించింది. సన్యోగిత గోర్పదే, శ్రుతి మిశ్రా జోడిని 21-12, 21-10 తేడాతో ఓడించింది.

కిరణ్​ జార్జ్​దే..

21 ఏళ్ల కిరణ్ జార్జ్.. పురుషుల సింగిల్స్​ టైటిల్​ గెలిచాడు. ప్రియాన్షు రజావత్​పై విజయం సాధించాడు. కాగా, మిక్స్​డ్ డబుల్స్​లో భారత్​కు చెందిన అర్జున్, ట్రీసా జాలీని 21-16, 22-20 తేడాతో ఓడించి టైటిల్​ కైవసం చేసుకుంది శ్రీలంకకు చెందిన సచిన్ దియాస్, తిలిని జోడీ.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

శిఖరాగ్రాన భారత జట్టు.. ఆ మ్యాచ్​తో 1000 వన్డేల రికార్డు

Australian Open: మహిళల డబుల్స్‌ టైటిల్​ గెలిచిన క్రెజికోవా, సైనికోవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.