ETV Bharat / sports

రికార్డు ధరకు న్యాయం చేసిన ఆసీస్​ ఆటగాళ్లు - జట్లనే మార్చేశారుగా! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 7:50 PM IST

IPL 2024 Australian Players : ఐపీఎల్ 17వ సీజన్‌లో అంచనాలకు మించి రెండు జట్లు ఫైనల్​కు చేరి తమ సత్తా చాటాయి. అయితే ఆ టీమ్‌లు అంతటి అద్భుతమైన ఫామ్​ కనబరచడం వెనక ఇద్దరు స్టార్ క్రికెటర్లు కీలక పాత్ర పోషించారు. ఆ విశేషాలు మీ కోసం.

IPL 2024 Australian Players
IPL 2024 Australian Players (Source : Associated Press)

IPL 2024 Australian Players : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్​లో ఎంతో మంది ప్లేయర్లు ఊహించని స్థాయిలో ఆడి తమ తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. రెమ్యూనరేషన్​తో సంబంధం లేకుండా చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అయితే ఈ సారి కొంత మంది ప్లేయర్లు మాత్రం మినీ వేలంలో అత్యధిక ధర పలికినప్పటికీ క్రీజులో మాత్రం పేలవ ఫామ్​తో అభిమానులను నిరాశపరిచారు. కానీ ఈ ఐపీఎల్ ఆరంభంలో మాత్రం రికార్డు రేటు పలికిన ఓ ఇద్దరు ఆటగాళ్లు మొదట్లో నిరాశపరిచేలా కనిపించినప్పటికీ, చివరిలో తమ అద్భుతమైన పెర్ఫామెన్స్​తో అదరగొట్టి అందరినీ అబ్బురపరిచారు.

కేకేఆర్ మెయిన్ పిల్లర్ - మిచెల్ స్టార్క్
ఐపీఎల్ సీజన్ 17 కోసం జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ మిచెల్ స్టార్క్​ను ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ రూ.24.75 కోట్ల‌కు కొనుగోలు చేసింది. భారీ అంచనాలతో స్టార్క్​ను బరిలోకి దింపిన కేకేఆర్ జట్టుకు తొలుత నిరాశే మిగిలింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు. పైగా రెండు మ్యాచ్‌ల్లో క‌లిపి వంద ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తాడని ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న సమయంలో స్టార్క్ ఇలాంటి ఫామ్​ కనబరిచే సరికి అటు కోల్‌కతా జట్టతో పాటు ఇటు అభిమానులు కూడా నిరాశచెందారు.

అయితే లీగ్ దశ ఆరంభంలో అతడ్ని అంచనా వేసినవారిని అవాకయ్యేలా చేశాడు. కీలక మ్యాచ్‌ల్లో అదరగొట్టి జట్టుకు అండగా నిలిచాడు. ముఖ్యంగా ప్లేఆఫ్ రేసులో నిలకడగా రాణించాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్​ మ్యాచ్​లో మూడు వికెట్లతో తన సత్తా చాటాడు. అలా తన రేటుకు అతడు పూర్తి న్యాయం చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు.

కెప్టెన్సీలో దిట్ట - సన్​రైజర్స్ కొత్త వెలుగు కమిన్స్
ఈ ఏడాది సన్​రైజర్స్​ హైదరబాద్ జట్టు అద్భుత పెర్ఫామెన్స్​తో చెలరేగిపోయింది. మొదటి మూడు మ్యాచుల్లో అంతంత మాత్రంగా ఆడిన ప్లేయర్లు, ఆ తర్వాత వేగం పుంజుకుని ఎన్నో కొత్త రికార్డులను సృష్టించారు. దీనికంతటికి కారణం ఆ జట్టు కెప్టెన్​ ప్యాట్​ కమిన్స్​.

11 ఏళ్లుగా ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును ఈ సీజన్​లోనే సన్‌రైజర్స్ రెండుసార్లు బద్దలు కొట్టింది. జట్టును ఇలా మార్చే విషయంలో కమిన్స్ కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా వ్యక్తిగతంగానూ జట్టుకు మంచి ఇన్నింగ్స్. 16 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాటుతోనూ అదరగొట్టాడు. ప్లేఆఫ్స్ దశలో జట్టు నిలకడ తప్పినప్పటికీ కమిన్స్ మాత్రం సూపర్​ ఫామ్​లో కొనసాగాడు. ఫైనల్స్​లోనూ 24 పరుగులతో అతడే టాప్ స్కోరర్‌. బౌలింగ్‌లోనూ ఒక వికెట్ కూడా పడగొట్టాడు.

'స్టార్క్‌కు రూ.25 కోట్లు, నీకు రూ.55 లక్షలేనా?' - ఐపీఎల్‌ శాలరీపై రింకూ షాకింగ్‌ రియాక్షన్‌! - Rinku Singh

IPL​ ప్రైజ్​మనీ- 'కోల్​కతా'కు రూ.20 కోట్లు- మరి ఎవరెవరికి ఎంతంటే? - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.