తెలంగాణ

telangana

సొంత గడ్డపై బెంగళూరు విజయం.. పడిక్కల్,​ జైస్వాల్​ పోరాటం విఫలం..

By

Published : Apr 23, 2023, 7:38 PM IST

Updated : Apr 23, 2023, 10:05 PM IST

బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​​ ఓటమిని మూటగట్టుకుంది. ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచ్​లో 7 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ఓడిపోయింది.

ipl 2023 rajastan royals vs royal challengers banglore match
ipl 2023 rajastan royals vs royal challengers banglore match

బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​​ ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరు చేతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ టీమ్​కు ఆదిలోనే షాక్​ తగిలింది. తొలి ఓవర్​లోని నాలుగో బంతికి ఓపెనర్​ జోస్​ బట్లర్​ క్లీన్​ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత దేవదత్​ పడిక్కల్(52) ​, యశస్వి జైస్వాల్ (47)​ దూకుడుగా ఆడినప్పటికీ విజయాన్ని ముద్దాడలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సిరాజ్‌, డేవిడ్‌ విల్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆఖ‌ర్లో ధ్రువ్ జురెల్(34) అబ్దుల్​ బసీత్​ జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌మయ్యారు.

అంతకుముందు టాస్​ గెలిచి బౌలింగ్​ను ఎంచుకున్న రాజస్థాన్​ టీమ్ తమ బౌలింగ్​తో కోహ్లీని ఫెవిలియన్​కు పంపింది. తొలి ఓవ‌ర్​లోనే కోహ్లీని రాజస్థాన్​ ప్లేయర్​ ట్రెంట్ బౌల్ట్ ఔట్​్ వేశాడు. దీంతో తొలి బంతికే కోహ్లి గోల్డెన్ డ‌కౌటయ్యి పెవిలియన్​కు చేరాడు. దీంతో నిర్దిష్ట‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది బెంగళూరు జట్టు.​ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాఫ్ డుఫ్లెసిస్ (62)అర్థ సెంచరీతో ఆదుకున్నారు. వీరిద్దరూ తప్ప ఇంకెవరూ రాణించలేకపోయారు.

ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు ప్లేయర్లు పేలవ ప్రదర్శన కనబరిచారు. కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయారు. ఒకానొక దశలో ఆర్సీబీ సులువుగా 220 స్కోరు సాధించేలా కనిపించింది. కానీ, మ్యాక్స్‌వెల్, డు ప్లెసిస్ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ గాడితప్పింది. చివరి ఏడు ఓవర్లలో ఆర్సీబీ.. 7 వికెట్లు కోల్పోయి 54 పరుగులే చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్‌ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.

మరోసారి గోల్డెన్​ డక్​తో విరాట్​..
2017 నుంచి ఇప్పటివరకు ఏప్రిల్ 23న జరిగిన మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ గోల్డెన్ డకౌటయ్యాడు. 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయిన కోహ్లీ.. గతేడాది(2022) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ అయ్యాడు. ఇక ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్​గా దిగిన కోహ్లీ(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్ స్వింగ్‌కు వికెట్లు ముందు దొరికిపోయాడు. దీంతో ఈ డే కింగ్​ కోహ్లీకి అంతగా అచ్చి రాలేదంటూ ఫ్యాన్స్​ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Last Updated :Apr 23, 2023, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details