తెలంగాణ

telangana

IPL 2023 century : ఐదులో నాలుగు మనవే.. ఎవరీ ప్రభ్​ సిమ్రన్​ సింగ్?

By

Published : May 14, 2023, 1:19 PM IST

ఐపీఎల్ 2023 సీజన్​లో ఇప్పటివరకు ఐదు సెంచరీలు నమోదయ్యాయి. అందులో నలుగురు భారత బ్యాటర్లే బాదడం విశేషం. ఇకపోతే తాజాగా దిల్లీతో జరిగిన మ్యాచ్​లో శతకం బాదిన సెన్షేషనల్​గా మారిన ప్రభ్​ సిమ్రన్​ సింగ్ ఎవరంటే?

Prabhsimran Singh stats and records
IPL 2023 century : ఐదులో నాలుగు మనవే.. ఎవరీ ప్రభ్​ సిమ్రన్​ సింగ్?

IPL 2023 century : ఐపీఎల్‌లో ఇప్పటివరకు టైటిల్ ముద్దాడని జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. 16 సీజన్లలో 15 మంది కెప్టెన్లను మార్చిన పంజాబ్.. గత 3 సీజన్లలో వరుసగా ముగ్గురు కెప్టెన్లను మార్చింది. అయితే తాజాగా ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్​ను ఓడించి ప్లే ఆఫ్స్​ రేసును రసవత్తరంగా మార్చింది. అయితే దిల్లీతో జరిగిన మ్యాచ్​లో.. స్పిన్ పిచ్‌పై మిగిలిన బ్యాటర్లు రెండంకెల స్కోరును చేయడానికి కష్టపడితే.. ఓపెనర్ ప్రభ్​ సిమ్రన్ సింగ్ మాత్రం(65 బంతుల్లో 103; 10x4, 6x6) సెంచరీ నమోదు చేశాడు. 42 బంతుల్లో అర్ధ శతం నమోదు చేసిన అతడు.. 61 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. అంటే 19 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ చేసి.. పంజాబ్ కింగ్స్‌కు 167 పరుగుల స్కోరును అందించాడు. జట్టును గెలిపించాడు.

ఐదుగురులో నలుగురు మనోళ్లే.. అయితే ఈ సీజన్​లో ప్రభ్​ సిమ్రన్​ సింగ్ ​ సింగ్​తో పాటు ఇప్పటివరకు హ్యారీ బ్రూక్​, వెంకటేశ్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్‌లు శతకాలు బాదారు. వీరిలో నలుగురు భారత బ్యాటర్లే కావడం విశేషం. ఇలా ఒకే సీజన్‌లో నలుగురు భారత ప్లేయర్లు శతకాలు నమోదు చేయడం ఇది రెండోసారి. అంతకుముందు 2019లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, అజింకా రహానే ఈ ఫీట్​ను అందుకున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే.. యశస్వి జైస్వాల్, ప్రభ్​ సిమ్రన్ సింగ్ ఇద్దరూ కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే. ఐపీఎల్ హిస్టరీలో ఒకే సీజన్‌లో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు శతకాలు చేయడం ఇదే ఫస్ట్​ టైమ్​.

ప్రభ్​ సిమ్రన్​ సింగ్ ఎవరంటే?.. 2019 ఐపీఎల్ వేలంలో ప్రభ్​ సిమ్రన్​ సింగ్​ను రూ.4.8కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్. అలా 2019 సీజన్‌లో ఒక్క మ్యాచ్, 2020-21 సీజన్లలో రెండేసి మ్యాచులు 2022లో ఒక మ్యాచ్ ఆడాడు. అయితే ఈ ఏడాది ప్రభ్​ సిమ్రన్​ సింగ్​.. వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్​లో 12 మ్యాచులు ఆడి 334 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు మరో అర్ధ సెంచరీ కూడా ఉంది.

గతేడాది పంజాబ్ తరఫున ఫస్ట్ క్లాస్​లో అరంగేట్రం చేసిన ప్రభ్​ సిమ్రన్​ సింగ్ ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్​ ఆడి 689 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్​ సెంచరీ ఉంది. లిస్టు -ఏ క్రికెట్‌లో 23 ఇన్నింగ్స్​లో 664 పరుగులు ఆడి ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు బాదాడు. టీ20ల్లో 52 ఇన్నింగ్స్​ల్లో 1490 పరుగులు చేశాడు. అందులో 2 శతకాలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఇతడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న అన్‌మోల్ సింగ్‌కు బంధువు కూడా అవుతాడు. వీరిద్దరు అన్నాదమ్ములు కూడా అవుతారు.

ఇదీ చూడండి:IPL 2023 PBKS VS DC : పంజాబ్‌ హీరో ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్​.. మ్యాచ్​ హైలైట్​ ఫొటోస్​ చూశారా?

ABOUT THE AUTHOR

...view details