తెలంగాణ

telangana

టీ-20ల్లో నయా సంచలనం.. అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్​లో దూకుడు

By

Published : Aug 9, 2022, 5:44 PM IST

కామన్వెల్త్​ గేమ్స్​లో టీమ్​ఇండియా ఆద్యంతం రాణించినా.. ఫైనల్లో చతికిలపడింది. రజతంతో సరిపెట్టుకుంది. అయితే.. భారత మహిళల జట్టులో ఓ ప్లేయర్​ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెనే రేణుకా సింగ్​ ఠాకుర్​. ఆ టోర్నీలో లీడింగ్​ వికెట్​ టేకర్​గా నిలిచిన ఆమె.. ఇప్పుడు టీ-20 ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లింది.

ICC Womens T20I Player Rankings: Renuka Singh surges to career-best ranking
ICC Womens T20I Player Rankings: Renuka Singh surges to career-best ranking

Renuka Singh Thakur: కొంతకాలంగా టీ-20ల్లో సంచలన ప్రదర్శన చేస్తోంది భారత మహిళా క్రికెటర్​ రేణుకా సింగ్​ ఠాకుర్​. ఇటీవల కామన్వెల్త్​ గేమ్స్​లో లీడింగ్​ వికెట్​ టేకర్​గా నిలిచింది. మొత్తం 11 వికెట్లతో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ 2 కీలక వికెట్లు పడగొట్టింది రేణుకా. ఇప్పుడు ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ-20 బౌలర్ల ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లింది. తన కెరీర్​ బెస్ట్​ 18వ స్థానంలో నిలిచింది. ఏకంగా 10 స్థానాలు ముందుకొచ్చి.. టాప్​-20లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్​ లెఫ్టార్మ్​ స్పిన్నర్​ సోఫీ ఎసిల్​స్టోన్​ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫాస్ట్​ బౌలర్​ కేథరిన్​ బ్రంట్​ రెండో స్థానంలో ఉంది.
బ్యాటర్లలో ఆస్ట్రేలియా ఓపెనర్​ బెత్​ మూనీ మళ్లీ నెం.1 ర్యాంకుకు చేరింది. కెప్టెన్​ మెగ్​ లానింగ్​ రెండో స్థానంలో ఉంది. భారత బ్యాటర్​ జెమిమా రోడ్రిగ్స్​ తిరిగి టాప్​-10లోకి ప్రవేశించింది. ఏకంగా ఏడు స్థానాలు మెరుగైంది.

కామన్వెల్త్​ క్రీడల్లో తొలి మ్యాచ్‌, ఫైనల్​ మ్యాచ్​లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా.. రేణుకా సింగ్‌ బౌలింగ్‌ మాత్రం అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే తొలి మ్యాచ్​లో అలిస్సా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్‌, తహ్లియా మెక్‌గ్రాత్ ఇలా అగ్రశ్రేణి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపింది. ఫైనల్లోనూ హేలీ, హ్యారిస్​ వికెట్లు తీసింది. ఇక రెండో మ్యాచ్‌లో పాక్‌పై పొదుపు బౌలింగ్ చేసి కట్టడి చేసింది. భారత్‌కు చావోరేవో తేల్చుకోవాల్పిన మ్యాచ్‌లో బార్బడోస్‌ బ్యాటర్లను చుట్టేసింది. పవర్‌ప్లేలో 3 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు కీలకవికెట్లు పడగొట్టింది. మొత్తం 5 మ్యాచ్​ల్లో.. 11 వికెట్లతో టాప్​ వికెట్​ టేకర్​గా నిలిచింది.

స్వింగ్‌ క్వీన్‌

రేణుకా సింగ్​ ఠాకుర్​
రేణుకా సింగ్‌ ఈ టోర్నీలో తన స్వింగ్‌ డిలివిరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తోంది. ఆసీస్‌పై తహ్లియా మెక్‌గ్రాత్ లాంటి బ్యాటర్‌నే ఇన్‌స్వింగ్‌తో బుట్టులో వేసుకొంది. ఇక బార్బడోస్‌పై ప్రతి బంతిని స్వింగ్ చేస్తూ పవర్‌ప్లే బ్యాటర్లకు సవాల్‌ విసిరింది. దీంతో సోషల్‌ మీడియాలో భువనేశ్వర్‌తో పోలుస్తూ అభిమానులు స్వింగ్‌ క్వీన్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి:కామన్వెల్త్ క్రీడల్లో భారత్​కు పతకాల పంట.. మన 'బంగారాలు' వీరే..

Commonwealth Games: అమ్మాయిలు.. సరిలేరు మీకెవ్వరూ

ABOUT THE AUTHOR

...view details