తెలంగాణ

telangana

మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత.. ప్రధాని సంతాపం

By

Published : Feb 16, 2022, 7:53 AM IST

Updated : Feb 16, 2022, 11:49 AM IST

music director Bappi Lahiri died
మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత

07:51 February 16

music director is no more

music director Bappi Lahiri died: సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి(69) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. బప్పి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

లాస్‌ ఏంజెలెస్‌లో ఉన్న ఆయన కుమారుడు బప్పా లహిరి కోసం కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు. జుహులోని పవన్ హన్స్ క్రిమటోరియమ్‌లో. బప్పిలహిరి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు.

నేపథ్యం

బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బప్పిలహిరి అసలు పేరు అలోకేశ్ లహిరి. పశ్చిమ బంగాల్‌లోని జల్పాయ్‌గురిలో 1952 నవంబరు 27న ఆయన జన్మించారు. తెలుగు, హిందీ, బెంగాలీ చిత్రాలకు సంగీతం అందించిన బప్పిలహిరి బెంగాలీ, హిందీ, తెలుగు చిత్రాల్లో నేపథ్య గాయకుడిగాను ప్రేక్షకులను అలరించారు. కొన్ని సినిమాల్లో నటించారు. ప్రముఖ యానిమేటెడ్ చిత్రం మోనాలో టమోటోవా పాత్రకు హిందీ డబ్బింగ్ కూడా చెప్పారు.

సింహాసనం చిత్రానికి సంగీతం అందించడం ద్వారా తెలుగు సినీపరిశ్రమలోకి బప్పిలహిరి అడుగు పెట్టారు. స్టేట్‌రౌడీ, సామ్రాట్‌, గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రాలకు బప్పిలహిరి సంగీతం అందించారు. రౌడీగారిపెళ్లాం, దొంగ పోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్‌బాస్‌, ఖైదీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రాలకు.. ఆయనే సంగీతం అందించారు. ఇటీవల డిస్కోరాజా చిత్రంలో.... 'రమ్, పమ్‌, బమ్' పాటను రవితేజ, శ్రీకృష్ణతో కలిసి పాడారు.

మిథున్‌ చక్రవర్తి తొలి చిత్రమైన డిస్కో డాన్స్‌ సహా ఆయన మరో సూపర్ హిట్ చిత్రం డాన్స్‌ డాన్స్‌కు సంగీతంతో పాటు నేపథ్య గానం అందించారు. చల్తే చల్తే, నమక్ హలాల్, హిమ్మత్‌ వాలా, షరాబి, ఐత్‌బార్, గిరఫ్‌తార్‌ వంటి సూపర్ హిట్ చిత్రాల్లోసంగీతం అందించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు బప్పిలహిరి. 2011లో సంచలనం సృష్టించిన డర్టీ పిక్చర్‌లో "ఊ లాలా" పాటను శ్రేయా గోషాల్‌లతో కలిసి బప్పిలహిరి పాడారు. టైగర్‌ ష్రాఫ్‌ హిట్‌ చిత్రం బాఘీ-3 సినిమాకు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అభిమానులను అలరించారు. 2014లో భాజపాలో చేరిన బప్పిలహిరి .2014లో శ్రీరాంపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

Bappilahiri died: 'బప్పి లహిరి ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతారు'

Last Updated : Feb 16, 2022, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details