ETV Bharat / sitara

Bappilahiri died: 'బప్పి లహిరి ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతారు'

author img

By

Published : Feb 16, 2022, 10:53 AM IST

Updated : Feb 16, 2022, 11:23 AM IST

Singer Bappilahiri died: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) మృతి పట్ల పలువురు సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా బప్పితో తమకున్న అనుబంధాన్ని తెలుపుతున్నారు.

bappilahiri
బప్పీలహిరి మృతి

Singer Bappilahiri died: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సంతాపం తెలిపారు. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్​ చిరంజీవి, దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ సహా పలువురు ఉన్నారు. వీరందరూ బప్పితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఎవరెవరు ఏమని ట్వీట్​ చేశారో చూద్దాం..

"లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌ బప్పి లహిరి ఆకస్మిక మరణం నన్ను ఎంతో కలచివేసింది. వ్యక్తిగతంగా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నటించిన పలు సినిమాలకు ఆయన చార్ట్‌బస్టర్‌ హిట్స్‌ అందించారు. ఆయన అందించిన సంగీతంతో నా సినిమాలకు ప్రేక్షకుల్లో మరింత పాపులారిటీ దక్కింది. ఎన్నో పాటల రూపంలో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే"

- చిరంజీవి

"మరో అద్భుతమైన గాయకుడిని సినీపరిశ్రమ కోల్పోయింది. నాతో సహా ఎన్నో లక్షల మంది డ్యాన్స్​ చేయడానికి మీ స్వరమే కారణం. మీ మ్యూజిక్​తో ఎంతో మందికి సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు. మీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి"

-అక్షయ్​కుమార్​, బాలీవుడ్​ స్టార్​ హీరో

"అద్భుతమైన సంగీత దర్శకుడు బప్పి లహిరి ఆకస్మిక మరణం బాధాకరం. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆయన పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. పాటల రూపంలో ఆయన ఎప్పటికీ అభిమానుల మదిలో నిలిచే ఉంటారు"

-రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

"బప్పి లహిరి మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటు. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి"

- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

"బప్పి లహిరి అందించిన సంగీతం ఎన్నో అందమైన భావోద్వేగాలను వ్యక్తీకరించింది. ఏ తరం వారైనా ఆయన సంగీతానికి మంత్రముగ్ధులు కావాల్సిందే. నేడు ఆయన ఆకస్మిక మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి"

- నరేంద్రమోదీ

  • Bappi Da was so endearing in person. But, his music had an edge. He introduced a more contemporary style to Hindi film music with Chalte Chalte, Suraksha & Disco Dancer.
    🕉 Shanti Dada🙏 You will be missed

    — Ajay Devgn (@ajaydevgn) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • In the demise of Shri Bappi Lahiri, India has lost yet another veteran singer and composer. Bappi Da will always be remembered for his foot-tapping numbers. My deepest condolences to his family and followers. Om Shanti! pic.twitter.com/qGuMCkfdfB

    — Vice President of India (@VPSecretariat) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Shri Bappi Lahiri Ji’s music was all encompassing, beautifully expressing diverse emotions. People across generations could relate to his works. His lively nature will be missed by everyone. Saddened by his demise. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/fLjjrTZ8Jq

    — Narendra Modi (@narendramodi) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Shri Bappi Lahiri was a matchless singer-composer. His songs found popularity not only in India but abroad. His diverse range included youthful as well as soulful melodies. His memorable songs will continue to delight listeners for long time. Condolences to his family and fans.

    — President of India (@rashtrapatibhvn) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Sad news of the passing away of legendary musician #BappiLahiri ji 🙏🏻 he will be fondly remembered for his mesmerising musical compositions which are loved by people of all ages. My condolences to the family. RIP #BappiDa ॐ शान्ति 🙏🏻

    — Yuvraj Singh (@YUVSTRONG12) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I really enjoyed Bappi Da's music, especially “yaad aa raha hai” - heard it several times in the dressing room. The range of his talent was truly amazing.
    आप हमेशा हमें याद रहोगे बप्पी दा! pic.twitter.com/NFougJVt8c

    — Sachin Tendulkar (@sachin_rt) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత.. ప్రధాని సంతాపం

Last Updated : Feb 16, 2022, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.