తెలంగాణ

telangana

ఓటీటీలోకి లైగర్.. ఎప్పుడంటే..?

By

Published : Feb 18, 2022, 1:32 PM IST

Liger Movie OTT Rights: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్​ దేవరకొండ నటిస్తున్న లైగర్​ సినిమా పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్​స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

vijay devarakonda
విజయ్ దేవరకొండ

Liger Movie OTT Rights: లైగర్ సినిమా పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులకు డిస్నీ హాట్‌స్టార్ భారీ ధరను వెచ్చించింది. రూ.65కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దక్షిణాది సినీ పరిశ్రమలో ఓటీటీలో ఇదో పెద్ద డీల్ అని సినీ వర్గాల చెప్పుకుంటున్నాయి. లైగర్ చిత్రం పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి.

టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ కథానాయకునిగా నటిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్​ పాత్రను పోషిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఆగష్టు 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఇదీ చదవండి:'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. ట్రైలర్ తేదీ ఫిక్స్​..!

ABOUT THE AUTHOR

...view details