ETV Bharat / sitara

'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. ట్రైలర్ తేదీ ఫిక్స్​..!

author img

By

Published : Feb 18, 2022, 8:11 AM IST

Sharwanand Adavallu meeku joharlu movie: శర్వానంద్​, రష్మిక కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ట్రైలర్​ను ఈనెల 19న విడుదల చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 6:03గంటలకు మూడో లిరికల్‌ గీతాన్ని విడుదల చేయనుంది చిత్రబృందం.

Adavallu meeku joharlu
ఆడవాళ్లు మీకు జోహార్లు

Sharwanand Adavallu meeku joharlu movie: శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. తిరుమల కిషోర్‌ తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్‌, ఊర్వశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 19న చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 6:03గంటలకు మూడో లిరికల్‌ గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాల్ని గురువారం ప్రకటించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో శర్వా తన కుటుంబంతో ఎంత ఆప్యాయంగా ఉంటారో చూపించారు.

"ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ కుటుంబ కథా చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. టైటిల్‌కు తగ్గట్లుగానే మహిళల గొప్పతనాన్ని చాటే విధంగా ఉంటుంది" అని చిత్ర వర్గాలు తెలిపాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ట్రెండ్ మారింది.. స్టోరీ సెలక్షన్ అదిరింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.