తెలంగాణ

telangana

'ముందుగా మేమే దాడి చేస్తాం'.. మరోసారి కిమ్ అణు బెదిరింపులు

By

Published : Apr 30, 2022, 2:17 PM IST

Kim nuclear warning: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తమ శత్రుదేశాలకు మరోసారి హెచ్చరికలు చేశారు. తమపై బెదిరింపులకు పాల్పడితే అణ్వాయుధాలతో దాడి చేసేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. తామే తొలుత అణు దాడి చేస్తామని చెప్పారు.

Kim nuclear warning
Kim nuclear warning

Kim nuclear warning: ఉత్తర కొరియాపై బెదిరింపులకు పాల్పడే వారిపై అణ్వాయుధాలతో దాడి చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హెచ్చరించారు. శత్రుదేశం కంటే ముందు తామే ఆ దాడి జరుపుతామని తేల్చిచెప్పారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వార్షికోత్సవం సందర్భంగా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో భారీ సైనిక కవాతును నిర్వహించారు. ఈ కవాతులో భారీ అణ్వాయుధాలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు వివిధ రకాల స్వల్ప శ్రేణి ఘన-ఇంధన క్షిపణులను ప్రదర్శించారు.

సైనికులతో కిమ్

తమపై ఆంక్షలు విధించే దేశాలకు అణ్వాయుధాలతో సమాధానం చెప్తామని తేల్చిచెప్పారు. శత్రుదేశాల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటామని కిమ్‌ స్పష్టం చేశారు. ఉత్తర కొరియాను అణచివేయాలనుకునే శత్రుదేశాల ప్రయత్నాలను అణ్వాయుధాలతో అడ్డుకుంటామని తెలిపారు. భారీ సైనిక కవాతుతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు కిమ్‌ పరోక్షంగా మరోసారి హెచ్చరికలు జారీచేశారు.

ABOUT THE AUTHOR

...view details