తెలంగాణ

telangana

Brazil Plane Crash Today : అడవిలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు సిబ్బంది సహా 14 మంది దుర్మరణం

By PTI

Published : Sep 17, 2023, 6:47 AM IST

Updated : Sep 17, 2023, 7:28 AM IST

Brazil Plane Crash Today : బ్రెజిల్​లో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమాన సిబ్బంది సహా 14 మంది మరణించారు. ఉత్తర అమెజాన్‌లోని బార్సిలోస్ ప్రావిన్స్‌ పరిధిలో ఘటన జరిగింది.

brazil-plane-crash-today-in-amazon-rainforest-several-died
బ్రెజిల్​లో విమాన ప్రమాదంలో పలువురి మృతి

Brazil Plane Crash Today :బ్రెజిల్‌లోని అమెజాన్ అడవిలో విమానం కుప్పకూలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఉత్తర అమెజాన్‌లోని బార్సిలోస్ ప్రావిన్స్‌ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి గురైన ఎంబ్రేయర్ PT-SOG విమానం మనౌస్ నుంచి బయలుదేరిందని అమెజానాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు. 12 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్ల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు విల్సన్ లిమా.

భారీ వర్షాలు కారణంగా విమానం కూలినట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ప్రమాద స్థలానికి ఓ బృందాన్ని పంపింది బ్రెజిలియన్ వైమానిక దళం. విమానం ల్యాండ్​ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగిందని అక్కడి మీడియా వెల్లడించింది. బ్రెజిల్​ కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్‌ రాజధాని మనౌస్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఘటనా స్థలం ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన విమానం మనౌస్ ఎయిర్ టాక్సీ సంస్థకు చెందిందని బ్రెజిల్​ సివిల్​ ఎవిగేషన్​ ఏజెన్సీ తెలిపింది.

హైవేపై కూలిన విమానం.. కారు, బైక్​తో ఢీ.. 10 మంది మృతి..
Malaysia Plane Crash : కొద్ది రోజుల క్రితం చార్టర్​ విమానం అదుపుతప్పి కూలిన ఘటనలో 10 మంది మరణించారు. ఈ ఘటన మలేసియా రాజధాని కౌలాలంపుర్​కు ఉత్తరాన ఉన్న హై​వేపై జరిగింది. లంకావి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుల్తాన్​ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎక్స్​ప్రెస్​ వేపై కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది మృతి చెందారు.ఈ విమానం ఎక్స్​ప్రెస్ వేపై కూలడం వల్ల కారుతో పాటు బైక్​ను ఢీ కొట్టింది. దీంతో మరో ఇద్దరు మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Columbia Plane Crash : అమెజాన్‌ అడవుల్లో అద్భుతం.. 40 రోజులు తర్వాత సేఫ్​గా నలుగురు చిన్నారులు

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం.. పైలట్​, చిన్నారికి తీవ్ర గాయాలు.. లైవ్ వీడియో..

Last Updated : Sep 17, 2023, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details