ETV Bharat / international

Malaysia Plane Crash : హైవేపై కూలిన విమానం.. కారు, బైక్​తో ఢీ.. 10 మంది మృతి

author img

By

Published : Aug 17, 2023, 6:46 PM IST

Updated : Aug 17, 2023, 8:11 PM IST

Malaysia Plane Crash : చార్టర్​ విమానం కూలి 10 మంది మరణించిన ఘటన మలేసియాలో జరిగింది. రాజధాని కౌలాలంపుర్​కు ఉత్తరాన ఉన్న ఎక్స్​ప్రెస్​వేపై ఈ ప్రమాదం జరిగింది.

Malaysia Plane Crash
మలేసియా విమాన ప్రమాదం

Malaysia Plane Crash : చార్టర్​ విమానం అదుపుతప్పి కూలిన ఘటనలో 10 మంది మరణించారు. ఈ ఘటన మలేసియా రాజధాని కౌలాలంపుర్​కు ఉత్తరాన ఉన్న హై​వేపై జరిగింది. లంకావి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుల్తాన్​ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎక్స్​ప్రెస్​ వేపై కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది మృతి చెందారని అధికారులు చెప్పారు. ఈ విమానం ఎక్స్​ప్రెస్ వేపై కూలడం వల్ల కారుతో పాటు బైక్​ను ఢీ కొట్టిందని.. దీంతో మరో ఇద్దరు మరణించారని తెలిపారు.

Malaysia Charter Flight Accident Today : మధ్యాహ్నం 2.47 నిమిషాలకు సుబంగ్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌కు తాము ప్రమాదంలో ఉన్నట్లు విమానం నుంచి సందేశం వచ్చిందని.. ఆ తర్వాత 2.48కి ఎమర్జెన్సీ లాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వివరించారు. సిగ్నల్​ ఇచ్చిన మూడు నిమిషాలకే 2.51 నిమిషాల సమయంలో విమానం రహదారిపై కూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు విమానం బ్లాక్ బాక్స్​ను వెతుకుతున్నట్లు పేర్కొన్నారు.

Pilot Died in Flight : మరోవైపు అమెరికాకు చెందిన ఓ పైలట్​ ప్రయాణిస్తున్న విమానంలోనే మరణించారు. బాత్​రూంకు వెళ్లిన పైలట్​ హఠాత్తుగా అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన కో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ పైలట్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Pilot Dies in Mid Flight : లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం స్థానిక కాలమానం ప్రకారం.. గత ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన మూడు గంటల తర్వాత కెప్టెన్‌ ఇవాన్‌ ఆండౌర్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత బాత్రూమ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడే కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన ఇతర సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు విమానాన్ని సమీపంలోని పనామా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ సిబ్బంది హుటాహుటిన ఇవాన్‌ను పరిశీలించి.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 56 ఏళ్ల ఇవాన్‌ గత 25 ఏళ్లుగా పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలోనే ఆ విమానంలోని ప్రయాణికులను మరుసటి రోజు చిలీకి చేర్చినట్లు ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

బోర్టింగ్ గేటు వద్ద ఇండిగో పైలట్​ మృతి
Indigo Pilot Dies Nagpur : మరోవైపు భారత్​కు చెందిన ఓ పైలట్​ ప్రమాదవశాత్తు మరణించారు. ఇండిగో కెప్టెన్‌ నాగ్‌పుర్‌లోని విమానాశ్రయంలో బోర్డింగ్ గేటు వద్ద స్పృహతప్పి పడిపోయారు. నాగ్‌పుర్‌ నుంచి పుణెకు వెళ్లాల్సి ఉన్న విమానాశ్రయానికి చేరుకున్న ఆయన బోర్డింగ్‌ గేటు వద్దకు చేరుకోగానే అక్కడ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. తర్వాత సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఇంటిపై కూలిన ఆర్మీ యుద్ధ విమానం​.. ముగ్గురు మృతి.. పైలట్​ సేఫ్​! వైద్యులు ధ్రువీకరించారు.

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఇంజిన్​లో మంటలు.. గాల్లో చక్కర్లు కొడుతూ..

Last Updated : Aug 17, 2023, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.