ETV Bharat / international

విషాదం.. కుప్పకూలిన విమానం.. నలుగురు సైనికులు సహా 9మంది మృతి!

author img

By

Published : Jul 24, 2023, 6:41 AM IST

Sudan Plane Crash Today : సాంకేతిక లోపంతో సూడాన్​లో ఓ విమానం కుప్పకూలింది. దీంతో నలుగురు సైనిక సిబ్బంది సహా తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు

sudan plane crash today
sudan plane crash today

Sudan Plane Crash Today : సూడాన్​లో సాంకేతిక లోపంతో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ సైన్యం ధ్రువీకరించింది. పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్‌ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కూలినట్లు వెల్లడించింది. మృతుల్లో నలుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడింది.

Sudan Air Crash : "సాంకేతిక లోపం కారణంగా పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనిక సిబ్బందితో సహా 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడింది" అని సూడాన్​ ఆర్మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది.

యుద్ధానికి 100 రోజులు
Sudan Conflict : సూడాన్​ సైన్యం, పారా ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఏప్రిల్​ 15న చెలరేగిన అంతర్యుద్ధం ఆదివారం 100వ రోజుకు చేరుకుంది. ఆదివారం కూడా డార్ఫర్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. రాష్ట్ర రాజధాని న్యాలాలో జరిగిన ఈ ఘటనలో 16 మంది మరణించారు.

వైమానిక దాడిలో 22 మంది
Sudan Air Strike : సూడాన్ నగరంలో జులై 8న జరిగిన వైమానిక దాడిలో 22 మంది మరణించారు. అనేక మంది ప్రజలు గాయపడ్డారు. రాజధాని ఖార్టూమ్‌కు పొరుగున ఉన్న ఓమ్‌దుర్మాన్‌లోని నివాస ప్రాంతంలో ఈ దాడి జరిగింది.

ఊచకోతలో 17 మంది దుర్మరణం
సూడాన్​ రాజధాని ఖార్టూమ్​లో జూన్​లో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు చిన్నారులతో సహా 17 మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వైమానికి దాడిలో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి విమానం ద్వారా చేశారా లేక డ్రోన్​తో చేశారని అనే దానికి స్పష్టత రాలేదు. ఈ మేరకు సూడాన్​ ఆరోగ్య శాఖ ఫేస్​బుక్​లో వెల్లడించిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ఈ వైమానిక దాడిని 'ఊచకోత'గా ఆరోగ్య శాఖ అభివర్ణించిందని పేర్కొంది. ఈ దాడిలో 11 మంది గాయపడ్డారని, కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయని ది ఎమర్జెన్సీ రూమ్​ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ చెప్పినట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.