తెలంగాణ

telangana

తమన్నా-అనిల్​రావిపూడి మధ్య ఏం గొడవ జరిగిందంటే?

By

Published : Jun 6, 2022, 11:40 AM IST

Tamannah Anilravipudi fight: మిల్కీ బ్యూటీ తమన్నాతో గొడవపై దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించారు. అసలేం జరిగిందో వివరించారు. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Tamannah anil ravipudi  Fight
తమన్నాతో గొడవ.. క్లారిటీ ఇచ్చిన అనిల్​రావిపూడి

Tamannah Anilravipudi fight: 'ఎఫ్‌-3' షెడ్యూల్‌ విషయంలో హీరోయిన్​ తమన్నా-దర్శకుడు అనిల్‌ రావిపూడి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై స్పష్టనిచ్చారు అనిల్​. ఇద్దరి మధ్య కాస్త వేడి వాతావరణం నెలకొందని అన్నారు. 'ఎఫ్‌-3' సక్సెస్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఆయన తమన్నాతో గొడవ జరగడంపై మాట్లాడారు.

"ప్రస్తుతం తమన్నా వేరే సినిమా షూటింగ్స్‌, ఇతర పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు. అందుకే ప్రమోషన్స్‌లో భాగం కాలేకపోయారు. తమన్నాకు, నాకు గొడవలు జరిగాయంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. నిజం చెప్పాలంటే, మా మధ్య అంత పెద్ద గొడవలు ఏం జరగలేదు. 'ఎఫ్‌-3' షూట్‌ జరుగుతున్న రోజుల్లో ఓసారి.. షూట్‌ టైమ్‌ అయిపోయాక కూడా కొంతసేపు సెట్‌లోనే ఉండాలని చెప్పాం. "వర్కౌట్లు చేసుకోవాలి. టైమ్‌ లేదు. వెళ్లిపోవాలి" అని తమన్నా చెప్పింది. అలా, మా మధ్య రెండు రోజులపాటు వేడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. సాధారణంగా.. సెట్‌లో ఆర్టిస్టులు ఎప్పుడైనా డల్‌గా, కోపంగా ఉంటే నేనే తగ్గి వెళ్లి మాట్లాడిస్తుంటాను" అని అనిల్ క్లారిటీ ఇచ్చారు. ఇక, తన తదుపరి ప్రాజెక్ట్‌పై స్పందిస్తూ.. బాలయ్యతో ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నట్లు.. అది అక్టోబర్‌ నెలలో ప్రారంభం కానున్నట్లు చెప్పారు. దీంతోపాటే కరోనా అనంతరం సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో పరిస్థితులు మారాయన్నారు. ఓటీటీలు రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి 'ఎఫ్‌-3'ని సక్సెస్‌ చేశారంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడిండి: ఛాలెంజింగ్ రోల్​లో బన్నీ.. 55ఏళ్ల వ్యక్తిగా?

ABOUT THE AUTHOR

...view details