తెలంగాణ

telangana

OG Glimpse : చిరుతలా వేటాడుతూ పవన్ ఊచకోత.. 'ఓజీ' హంగ్రీ చీతా గ్లింప్స్ గూస్​బంప్సే

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 10:45 AM IST

Updated : Sep 2, 2023, 11:12 AM IST

OG Glimpse : పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా నుంచి హంగ్రీ చీతా గ్లింప్స్ వచ్చేసింది. ఈ వీడియోలో పవన్​ చిరుతలా శత్రువులను వేటాడుతూ ఊచకోత కోశాడు. చూస్తే గూస్​బంప్స్​ వచ్చేలా ఉంది. మీరు చూసేయండి..

Pawankalyan OG movie hungry cheetah glimpse
ఓజీ హంగ్రీ చీతా గ్లింప్స్

OG Glimpse : నేడు(సెప్టెంబర్​ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు. అలాగే ఆయన సినిమా అప్డేట్స్ కోసం ఈగర్​గా వెయిట్ చేస్తూ సోషల్​మీడియాలో హడావుడి చేస్తున్నారు. అందుకు తగ్గట్టే పవన్​ సినిమా మేకర్స్​.. వరుసగా అప్డేట్స్​ను వదులుతున్నారు.

ఇప్పటికే హరిహర వీరమల్లు ఉంచి ఓ మోషన్ పోస్టర్​ రిలీజ్ కాగా.. ఇప్పుడు 'ఓజీ' నుంచి కూడా అదిరిపోయే గ్లింప్స్​ వచ్చేసింది. 'హంగ్రీ చీతా' పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్​ వీడియో ఆద్యంతం పవర్​ఫుల్​గా ఆకట్టుకుంటోంది. మేకర్స్​ ముందుగా హింట్ ఇచ్చినట్టుగానే.. ఈ గ్లింప్స్​లో పవన్ కిల్లింగ్​ లుక్స్​, వైలైన్స్​, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్, విజువల్స్​, టేకింగ్​.. ఇలా ప్రతీది అస్సలు ఊహించని రేంజ్​లో వైల్డ్​గా ఉన్నాయి. పవన్ స్వాగ్​కు తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్, అదిరిపోయే విజువల్స్​​ తోడు అవ్వడం వల్ల.. హైలైట్​గా ఉంది. పవన్ క్యారెక్టరైజేషన్​ను ఎలివేట్​ చేస్తూ వచ్చిన డైలాగ్స్​ కూడా అదిరిపోయాయి.

'ఆకలితో ఉన్న పులి వస్తున్నట్లు' మేకర్స్​ చెప్పినట్టుగా పులి.. జింకలను వేటాడినట్టుగా ప్రచార చిత్రం మొత్తం సాగింది. పవన్​ తన శత్రువులను ఊచకోత కోస్తూ మైండ్ బ్లోయింగ్​ పెర్​ఫార్మెన్స్​తో కనిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుటి వరకు చూడని పవన్ విశ్వరూపాన్ని.. ఈ గ్లింప్స్​లో అద్భుతంగా చూపించారు.

"పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా.. అది మట్టి చెట్లతో పాటు సగం ఊరును ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం.. ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది. ఇట్​ వజ్​ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ పాత్​.. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.. సాలా సైతాన్​" అంటూ పవన్​ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్ సూపర్ అనే చెప్పాలి.

ఇకపోతే ఈ చిత్రాన్ని యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. 1990 నాటి ముంబయి మాఫియా బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ముంబయిలో ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్రీకరణ జరుపుకుంది.

Pawan Kalyan OG Release Date : ఇకపోతే ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్​ RRR నిర్మాత దానయ్య.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ప్రియాక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా పలువురు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Pawan Kalyan OG Movie : పవన్ ఫ్యాన్స్ గెట్​ రెడీ.. అగ్ని తుపాన్‌ వచ్చేస్తోంది

నెల గ్యాప్​లో పవన్ 'ఉస్తాద్​' - 'ఓజీ'.. అసలు అయ్యే పనేనా?

Last Updated : Sep 2, 2023, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details