తెలంగాణ

telangana

'తుపాకులతో పవన్ కల్యాణ్​​ను చూసి​ నక్సల్స్​లో కలుస్తాడని భయపడ్డా'

By

Published : Feb 11, 2023, 9:12 PM IST

Updated : Feb 11, 2023, 9:24 PM IST

ఇటు వరుస సినిమాలతో, అటు రాజకీయాల్లోనూ ఎంతో యాక్టివ్​గా ఉండే పవర్​స్టార్​ గురించి.. మెగాస్టార్​ చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్​కల్యాణ్​ ఒకానొక సందర్భంలో నక్సలైట్​ అయిపోతాడేమోనని భయపడినట్లు చిరంజీవి చెప్పారు. అందరికీ అభిమానులు ఉంటారు. పవన్‌కు మాత్రం భక్తులున్నారని కొనియాడారు. ఇంకా ఏమన్నారంటే..

chiranjeevi talks about pawan kalyan fans
chiranjeevi talks about pawan kalyan fans

పవన్​కల్యాణ్.. టాలీవుడ్​లో విపరీతమైన ఫ్యాన్​ ఫాలోయింగ్​​ ఉన్న అతి కొద్ది మంది కథానాయకులలో మొదటి వరుసలో ఉంటారు. అభిమానులందరూ ఆయనను డెమీ గాడ్​గా అభివర్ణిస్తారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మెగాస్టార్​ చిరంజీవి మరొక సారి చెప్పారు. సాధారణంగా నటులందరికీ అభిమానులు ఉంటే.. పవన్​కు మాత్రం భక్తులు ఉన్నారని.. పవర్​ స్టార్​ను ఆకాశానికెత్తేశారు. ప్రముఖ గాయని స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'నిజం' కార్యక్రమంలో పాల్గొన్న చిరు పలు విశేషాలను పంచుకున్నారు.

నటుడిగా, రాజకీయనాయకుడిగా పవన్‌ మీకెలా ఇష్టం? అని ప్రశ్నించగా, "పవన్‌కల్యాణ్‌ సహజ శైలిని బట్టి చూస్తే రాజకీయ నాయకుడిగానే నాకు ఇష్టం. బాధలకు స్పందించే తీరు, సాయం చేయాలన్న గుణం చిన్నప్పటి నుంచే అతడిలో ఉంది. ఒకానొక సందర్భంలో నక్సల్స్‌లోకి వెళ్లిపోతాడేమోనని అనిపించింది. తుపాకులతో ఆడుకునేవాడు. నేను సింగపూర్‌ షూటింగ్స్‌కు వెళ్లేటప్పుడు 'అక్కడి నుంచి ఏం తీసుకురాను' అని అడిగితే, 'ఇక్కడ మంచి గన్స్‌ దొరకడం లేదు. అక్కడి నుంచి తీసుకురా అన్నయ్యా' అని చెప్పేవాడు. డమ్మీ గన్స్‌ అయినా, అవి సెమీ ఆటోమేటిక్‌. ఆ తుపాకులు పట్టుకుని తిరుగుతుంటే రైల్వేస్టేషన్‌లో ఆపేశారు. డమ్మీ తుపాకులని తెలిసి వదిలేశారు. అతడికి ఉన్న కల్ట్‌ ఇమేజ్‌ పూర్తిగా భిన్నమైనది. 'అందరికీ అభిమానులు ఉంటారు. పవన్‌కు భక్తులున్నారు'" అని చిరు చెప్పుకొచ్చారు.

ఇక తనతో కలిసి నటించిన హీరోయిన్స్‌లో ఫేవరెట్‌ ఎవరు? అని అడగ్గా, రాధ, రాధిక, విజయశాంతి, శ్రీదేవి పేర్లను చెప్పారు. "ప్రతి ఒక్కరికీ వారికి సొంతమైన క్వాలిటీ ఉంది. అందుకే ఒకరి పేరు చెప్పమంటే చెప్పలేకపోతున్నా. సహజంగా నటిస్తూ, చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లే తత్వం రాధికకు ఉంది. డ్యాన్స్‌లో రాధ బెస్ట్‌. నువ్వా-నేనా అన్నట్లు చేస్తారు. ఆ విషయంలో గట్టి పోటీ ఇచ్చేవారు. ఇక విజయశాంతి సినిమాలో పాత్ర కోసం తనని తాను మలుచుకుంటారు. తెరపై మరింత పవర్‌ఫుల్‌గా కనిపించేలా నటిస్తారు. అంతేకాదు, ఏ పాత్రనైనా సులభంగా చేయగలరు. వీళ్లందరినీ పక్కన పెడితే, శ్రీదేవి డ్యాన్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే. ఇతర హీరోయిన్స్‌తో పోలిస్తే శ్రీదేవితో కలిసి నటించడాన్ని నేను ఎక్కువ ఆస్వాదించా" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Last Updated : Feb 11, 2023, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details