తెలంగాణ

telangana

మాధవపల్లిలో ఉద్రిక్తత.. భర్త ఆత్మహత్యకు భార్యే కారణమంటూ ఆందోళన!

By

Published : Jun 9, 2021, 12:52 PM IST

కామారెడ్డి జిల్లా మాధవపల్లి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పెద్దోళ్ల శివాజీ అనే వ్యక్తి ఆత్మహత్యకు అతడి భార్యే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేసేవరకు శవపరీక్ష నిర్వహించేది లేదని ధర్నాకు దిగారు.

madhavapalli
మాధవపల్లిలో ఉద్రిక్తత.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దోళ్ల శివాజీ(32) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సంతోషి అందుకు కారణమంటూ మృతుడి తరఫు బంధువులు ఆందోళనకు దిగారు. శివాజీ కుటుంబానికి న్యాయం చేసేవరకు పోస్టుమార్టానికి తీసుకెళ్లేది లేదని ధర్నా చేపట్టారు. పోలీసులు వచ్చి మృతుడి బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు.

మహారాష్ట్రలోని దేగ్లుర్ తాలుకా షాకుర్ గ్రామానికి చెందిన వ్యక్తి అని స్థానికులు తెలిపారు. 14 ఏళ్ల క్రితం మాధవపల్లి గ్రామానికి చెందిన పెద్దోళ్ల రజితను వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. వారికి ఒక పాప ఉంది. కొన్ని రోజుల తర్వాత రజిత అనారోగ్యంతో మరణించింది. రజిత తల్లిదండ్రులు తమ రెండో కూతురు సంతోషిని శివాజీకి ఇచ్చి వివాహం జరిపించారని తెలిపారు.

వివాహం అనంతరం సంతోషికి పోలీస్ కానిస్టేబుల్​గా ఉద్యోగం వచ్చిందని పేర్కొన్నారు. కామారెడ్డిలో ఆమె ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. ఇందల్వాయి ఎస్సై శివ కుమార్​తో వివాహేతర సంబంధం వల్లే శివాజీ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపించారు. ఈ విషయంపై పలుసార్లు పంచాయితీ పెట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:2 నెలల్లో సుమారు 38 కోట్ల జరిమానాలు

ABOUT THE AUTHOR

...view details