తెలంగాణ

telangana

Telangana Top News: టాప్​ న్యూస్ @7PM

By

Published : Jun 27, 2022, 7:00 PM IST

Updated : Jun 27, 2022, 7:08 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

  • 128 మంది విద్యార్థినులకు అస్వస్థత

సిద్దిపేటలో ఆహారం కలుషితమై 128 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో విద్యార్థినుల ఇబ్బందులు పడుతున్నారు.

  • లోన్‌యాప్స్‌ కేసుల్లో వెలుగులోకి కొత్త కోణం..

రుణ యాప్‌ కేసుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో రుణాలు తీసుకున్న వారిని నేరగాళ్లు ఆకర్షిస్తున్నారు. అవసరం లేకపోయినా గతంలో బాధితుల ఖాతాల్లో నగదు జమ చేసి... తర్వాత నిర్వాహకుల వేధింపులకు పాల్పడ్డారు. రుణ గ్రహీతలు, స్నేహితులకు నగ్న ఫొటోలు పంపుతున్న నేరగాళ్లు... రుణ గ్రహీతలు డబ్బు కట్టనందున మీరు కట్టాలని స్నేహితులను వేధిస్తున్నారు.

  • ఖైరతాబాద్‌ వినాయకుడి నమూనా చిత్రం విడుదల

దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన గణేశుడిగా పేరొందిన ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి పేరుతో కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధిన వివరాలను గణేశ్ ఉత్సవ కమిటీ వివరాలను వెల్లడించింది. దానితో పాటు.. వినాయకుడి విగ్రహం నమూనా చిత్రాన్ని గణేశ్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది.

  • ద్రౌపది X యశ్వంత్.. గెలుపెవరిది?

రాష్ట్రపతి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. దేశ అత్యున్నత పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేసింది.

  • అగ్నిపథ్​కు విశేష స్పందన.. 4 రోజుల్లో 94 వేల దరఖాస్తులు

అగ్నివీరుల నియామకానికి భారత వాయుసేన విడుదల చేసిన నోటిఫికేషన్​కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 94 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

  • మందు కొట్టి బండి ఎక్కితే ఆటోమెటిక్​గా బ్రేక్.. కొత్త సిస్టమ్ రెడీ!

మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పరికరాన్ని కనుగొన్నారు ఇంజినీర్లు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వాహనం నిలిచిపోయేలా ఈ పరికరాన్ని రూపొందించారు.

  • రోహిత్​ స్థానంలో ఆ ప్లేయర్​కు చోటు

ఇంగ్లాండ్​తో జరగనున్న ఐదో(రీషెడ్యూల్​) టెస్టు కోసం.. కరోనా బారిన పడిన రోహిత్​ శర్మ స్థానంలో మయాంక్​ అగర్వాల్​ను ఎంపిక చేసినట్లు తెలిపింది బీసీసీఐ. అయితే తాత్కాలిక కెప్టెన్​ ఎవరనేది చెప్పలేదు.

  • ఫాస్టాగ్​ నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యమా?

టోల్​ ప్లాజాల వద్ద ఆగాల్సిన పని లేకుండా.. సులభంగా టోల్​ రుసుము చెల్లించేందుకు కొన్నేళ్ల క్రితం ఫాస్టాగ్​ విధానాన్ని తీసుకువచ్చింది కేంద్రం. అయితే ఫాస్టాగ్​ను నుంచి డబ్బులు దొంగిలించవచ్చా?

  • సల్మాన్​కు ప్రేమతో సమంత.. ఆ వీడియోను షేర్​ చేసి..

బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​కు ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు హీరోయిన్​ సమంత. ఓ స్పెషల్ వీడియోను పోస్ట్​ చేసి దానికి లవ్​ సింబల్​ ఎమోజీలను జత చేశారు. ఎందుకంటే..

  • వెయిట్ లాస్​ కోసం 'లిక్విడ్ డైట్'.. ఆరోగ్యానికి ప్రమాదకరమా?

ఇటీవల కాలంలో చాలా మంది బరువు తగ్గడం కోసం లిక్విడ్​ డైట్​ను పాటిస్తున్నారు. తక్షణ శక్తిని అందించే ఈ లిక్విడ్​ డైట్​ వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి? మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏమైనా ప్రమాదకరమా? వీటన్నింటిపై నిపుణులు ఏమంటున్నారంటే?

Last Updated : Jun 27, 2022, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details