ETV Bharat / entertainment

సల్మాన్​కు ప్రేమతో సమంత.. ఆ వీడియోను షేర్​ చేసి..

author img

By

Published : Jun 27, 2022, 5:38 PM IST

Samantha Salman khan: బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​కు ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు హీరోయిన్​ సమంత. ఓ స్పెషల్ వీడియోను పోస్ట్​ చేసి దానికి లవ్​ సింబల్​ ఎమోజీలను జత చేశారు. ఎందుకంటే..

Samantha Salman khan
సల్మాన్​కు ప్రేమతో సమంత

Samantha Salman khan: తనను గుర్తించిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు స్టార్​ హీరోయిన్​ సమంత ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు. 'పుష్ప'లో సమంత స్టెప్పులేసిన 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' అనే పాట తనకెంతో నచ్చిందని ఇటీవల జరిగిన ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఐఫాలో సల్మాన్‌ అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. అది సామ్‌ కంటపడింది. ఆ వీడియోపై ఆమె స్పందిస్తూ లవ్‌ సింబల్‌ ఎమోజీతో సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక, అల్లుఅర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమా కోసం సామ్‌ మొదటిసారి ఐటమ్‌ సాంగ్‌ చేశారు. ఇందులో ఆమె బన్నీతో కలిసి వేసిన స్టెప్పులు ఆకర్షించాయి. రెండో భాగం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది. కాగా, ప్రస్తుతం 'శాకుంతలం', 'ఖుషి' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోన్న సామ్‌ త్వరలోనే సల్మాన్‌ఖాన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీచూడండి: హరీశ్​శంకర్​తో సినిమా.. బన్నీ-రామ్​.. చేసేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.