ETV Bharat / bharat

మందు కొట్టి బండి ఎక్కితే ఆటోమెటిక్​గా బ్రేక్.. కొత్త సిస్టమ్ రెడీ!

author img

By

Published : Jun 27, 2022, 6:26 PM IST

Updated : Jun 28, 2022, 6:15 AM IST

device-to-reduce-road-accidents
device-to-reduce-road-accidents

మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పరికరాన్ని కనుగొన్నారు ఇంజినీర్లు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వాహనం నిలిచిపోయేలా ఈ పరికరాన్ని రూపొందించారు.

మందు కొట్టి బండి ఎక్కితే ఆటోమెటిక్​గా బ్రేక్.. కొత్త సిస్టమ్ రెడీ!

రహదారి ప్రమాదాల్లో అత్యధికం.. మద్యం మత్తులో జరిగేవే! తాగి నడపడం వల్ల జరిగే ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు ఝార్ఖండ్ ధన్​బాద్​కు చెందిన ముగ్గురు ఇంజినీర్లు పరిష్కారం కనిపెట్టారు. ఆల్కహాల్ తాగేవారిని డ్రైవింగ్ చేయకుండా నివారించేలా ఓ పరికరాన్ని ఆవిష్కరించారు.

device-to-reduce-road-accidents
యువ ఇంజినీర్లు రూపొందించిన పరికరం
device-to-reduce-road-accidents
కారులో అమర్చిన పరికరం

కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్​లో పనిచేస్తున్న అజిత్ యాదవ్​కు ఈ ఆలోచన తట్టింది. బొగ్గు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు.. తరచూ మద్యం సేవించి ప్రమాదాలకు గురవడాన్ని చూసి ఈ పరికరాన్ని తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే తన స్నేహితులైన మనీశ్, సిద్ధార్థ్​తో కలిసి కార్యాచరణ ప్రారంభించారు. వాహనాలలో ఆల్కహాల్​ను పసిగట్టే సేఫ్టీ సిస్టమ్​ను రూపొందించారు.

device-to-reduce-road-accidents
కారులో అజిత్ యాదవ్
device-to-reduce-road-accidents
స్టీరింగ్​కు ఉన్న సెన్సర్.

"ఆల్కహాల్ సెన్సర్ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. వాహన చోదకుడు ఆల్కహాల్ సేవించాడో లేదో అనే విషయాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. డ్రైవర్ శ్వాసను గుర్తించి ఇది సెన్సర్​కు సమాచారం పంపిస్తుంది. ఆల్కహాల్​ ఆనవాళ్లు ఉంటే డిస్​ప్లేలో కనిపిస్తుంది. ఆ తర్వాత బజర్ మోగుతుంది. ఈ సిగ్నల్​ ఫ్యూయల్ పంప్​కు చేరగానే ఇంధన సరఫరా నిలిచిపోతుంది. ఆల్కహాల్ సేవించినట్లు తేలితే.. వాహనాన్ని స్టార్ట్ చేయనీయకుండా అడ్డుకుంటుంది."
-అజిత్ యాదవ్, కోల్ ఇండియా ఇంజినీర్

ఈ పరికరాన్ని మరింత అప్​గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అజిత్ యాదవ్ చెప్పారు. డ్రైవర్ కళ్లు మూసినా, నిద్రకు ఉపక్రమించినా.. గుర్తించేలా మరో రెండు సెన్సర్లను ఈ పరికరానికి అమర్చుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని టెస్టింగ్ కోసం 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ' వద్దకు పంపించారు. ఉన్నతాధికారుల అనుమతులు లభిస్తే పెద్ద వాహనాల కోసం తయారీ ప్రారంభిస్తామని యువ ఇంజినీర్లు చెబుతున్నారు. యువ ఇంజినీర్ల ప్రతిభను జిల్లా రవాణా అధికారి రాజేశ్ కుమార్ సింగ్ మెచ్చుకున్నారు. ఈ పరికరం చిన్నదైనా.. ఫలితం మాత్రం మెరుగ్గా ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:

Last Updated :Jun 28, 2022, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.