ETV Bharat / state

ఖైరతాబాద్‌ వినాయకుడి నమూనా చిత్రం విడుదల

author img

By

Published : Jun 27, 2022, 5:01 PM IST

Updated : Jun 27, 2022, 7:14 PM IST

A model image of the statue of Lord Ganesha in Khairatabad has been released
ఖైరతాబాద్‌ వినాయకుడి నమూనా చిత్రం విడుదల

16:56 June 27

Khairatabad Ganesh: శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతిగా నామకరణం

Khairatabad Ganesh:తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ మహా గణపతి ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఇందులో విగ్రహానికి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు త్రిశక్తి మహా సరస్వతి దేవి విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 50 అడుగుల ఎత్తుతో మట్టి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటుచేసేందుకు నిర్ణయించినట్లు ఉత్సవ కమిటీ ఇప్పటికే వెల్లడించింది. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధిన వివరాలను గణేశ్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. దానితో పాటు.. వినాయకుడి విగ్రహం నమూనా చిత్రాన్ని గణేశ్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. విగ్రహం 50 అడుగుల ఎత్తు ఉండనుందని తెలిపారు. వినాయకుడికి ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి, కుడివైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రి దేవి కొలువుదీరనున్నారు.

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రత్యేకతలు..

  • పంచముఖ మహా లక్ష్మీగణపతి విగ్రహం ఎత్తు 50 అడుగులు
  • ఐదు తలలు, 6 చేతులతో గణేశుడి విగ్రహాన్ని రూపుదిద్దనున్నారు.
  • అలంకరణ కోసం తలపై ఏడు సర్పాలను ఉంచనున్నారు.
  • కుడివైపు శ్రీ త్రిశక్తి మహాగాయత్రి , ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి విగ్రహాలు ఏర్పాటుకానున్నాయి

ఇదీ చూడండి

Last Updated : Jun 27, 2022, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.