తెలంగాణ

telangana

TOP NEWS: టాప్ న్యూస్ @ 9PM

By

Published : Jun 9, 2022, 8:56 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
top news

  • మైనర్లకు ఐదు రోజుల కస్టడీ

జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు మైనర్లను ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ జువైనల్‌ జస్టిస్‌ బోర్డు అనుమతిచ్చింది. ఈ కేసులో ఉన్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే ఉన్నారు. దీంతో ఈ ముగ్గురిని రేపట్నుంచి ఐదురోజుల పాటు పోలీసులు విచారించనున్నారు.

  • ఆ కేసులో పోలీసు అధికారులకు ఊరట

Telangana High Court: కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు ఊరట లభించింది. సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్షపై హైకోర్టు సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది. ఇటీవల నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించింది.

  • మేజర్లుగా పరిగణించాలంటున్న పోలీసులు.. కేటీఆర్ మద్దతు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు... ఐదుగురు మైనర్‌ నిందితులను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌ బోర్డును కోరనున్నారు

  • బండి సంజయ్ లేఖ.. ఆ అర్హత లేదన్న నిరంజన్ రెడ్డి

సీఎం కేసీఆర్​కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సంజయ్ రాసిన లేఖపై ఘాటుగా స్పందించారు మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి వడ్ల కొనుగోలులో రైతులను తప్పుదోవ పట్టించిన బండి సంజయ్.. భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ముక్కు నేలకు రాయాలని పేర్కొన్నారు.

  • రేవంత్​ ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Reddy Chit Chat: అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డికి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో.. మీడియాతో రేవంత్​ పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

  • ఆరోజే రాష్ట్రపతి ఎన్నిక

దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగింది. దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తా

Justice NV Ramana: ఎన్టీఆర్ మనిషిగా ఉండటాన్ని తాను గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 1983 నుంచి ఎన్టీఆర్.. మనిషిగా తనపై ముద్ర వేశారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని చెప్పారు.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,790గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,853గా ఉంది.

  • 'ఎన్​బీకే107' టీజర్​లో బాలయ్య గర్జన​

NBK 107 Teaser: శుక్రవారం (జూన్ 10) తన పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే అభిమానులకు అదిరిపోయే కానుక అందించారు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్​ను విడుదల చేశారు. మాస్​ డైలాగులతో టీజర్​ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

  • ప్రపంచ రికార్డు బ్రేక్

Ranji Trophy 2022: ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో చరిత్ర సృష్టించింది దేశవాళీ మేటి జట్టు ముంబయి. గురువారం ఉత్తరాఖండ్​తో జరిగిన క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. అత్యధికంగా 725 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

ABOUT THE AUTHOR

...view details