తెలంగాణ

telangana

నిర్విరామంగా సాగుతోన్న అమరావతి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు వైకాపా కుయుక్తులు

By

Published : Sep 25, 2022, 12:51 PM IST

Amaravati Farmers Padayatra: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రైతులకు అండగా నిలుస్తూ వారి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. జై అమరావతి అనే నినాదాలతో గుడివాడ దద్దరిల్లింది.

అమరావతి మహా పాదయాత్ర
అమరావతి మహా పాదయాత్ర

అమరావతి రాజధాని నినాదం ముందుకు సాగుతున్న మహిళాలోకం

Amaravati Farmers Padayatra: అమరావతే రాజధాని సంకల్పంగా రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 14వ రోజు కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. జై అమరావతి నినాదాలతో ఏపీలోని గుడివాడ పట్టణం ప్రతిధ్వనించింది. గుడివాడ రాకుండా ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా.. వాటిని లెక్కచేయకుండా ప్రజలు కదం తొక్కారు. దారి పొడవునా స్థానిక ప్రజలు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, రైతులు తరలి వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో‌ పాల్గొన్నారు. దేవినేని ఉమ, రావి వెంకటేశ్వరరావు, అఖిలపక్ష ఐకాస నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నానికి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించనున్నారు.

పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా కుయుక్తులు :అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఆటంకం సృష్టించేలా వైకాపా నేతలు కుయుక్తులు ప్రదర్శిస్తున్నారు. పాదయాత్ర కొనసాగే ఏపీలోని నందివాడ మండల ప్రధాన రహదారికి అడ్డంగా మరమ్మతుల పేరుతో ఇసుక టిప్పర్ లారీని నిలిపివేశారు. ఆ లారీని నందివాడ ఎంపీపీ పేయ్యల అదాంకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. రోడ్డుపై నుంచి టిప్పర్ లారీను తొలగించకుంటే పాదయాత్ర ముందుకు కదలదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో, జేసీబీ సహాయంతో లారీను పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details