తెలంగాణ

telangana

'నిలువ నీడ లేకుండా.. డబ్బులిస్తే ఏం చేసుకోవాలి'.. 'అవంతి'ని నిలదీసిన మహిళ

By

Published : Jul 26, 2022, 2:13 PM IST

EX MINISTER AVANTHI: ఏపీలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొంటున్న వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక ప్రజాప్రతినిధులు నీళ్లు నములుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా వేములవలసలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. అందులో భాగంగా ఓ మహిళ అడిగిన ప్రశ్నకు ఆయన ఖంగుతిన్నారు.

మాజీ మంత్రి అవంతిపై మహిళ ఆగ్రహం..
మాజీ మంత్రి అవంతిపై మహిళ ఆగ్రహం..

మాజీ మంత్రి అవంతిపై మహిళ ఆగ్రహం..

EX MINISTER AVANTHI: ఉండటానికి ఇల్లు లేదని.. ఇంటి స్థలం కూడా మంజూరు కాలేదని.. తాను ఏ చెట్టు కింద ఉండాలంటూ ఓ మహిళ అడిగిన ప్రశ్నకు.. ఏపీ మాజీ మంత్రి అవంతి ఖంగుతిన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేములవలసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. ఇళ్ల సమస్యలపై స్థానికులు ప్రశ్నించారు. తనకు ఇంటి స్థలం కూడా రాలేదని మహిళ నిలదీయగా.. డబ్బులిస్తున్నాం కదా అని అవంతి సమాధానమిచ్చారు.

నిలువ నీడ లేకుండా డబ్బులిస్తే.. ఏం చేసుకోవాలని బాధిత మహిళ ప్రశ్నించింది. ఇళ్లపై కోర్టు కేసులున్నాయని.. ఇది కాకుండా మరేమైనా ఉంటే చెప్పండని సూచించారు. వేములవలస ప్రజలకు ఇవ్వడానికి కోర్టు పరిధిలో ఉన్న భూమి ఒక్కటే ఉందా అని మరో వ్యక్తి నిలదీశారు. చేసేదేమీలేక మాజీ మంత్రి అవంతి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details