ETV Bharat / entertainment

David Warner passed away: ప్రముఖ నటుడు డేవిడ్ వార్నర్ కన్నుమూత

author img

By

Published : Jul 26, 2022, 12:24 PM IST

David Warner passed away: ప్రముఖ హాలీవుడ్​ నటుడు డేవిడ్ వార్నర్(80) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్​తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

David Warner of The Omen and Titanic fame passes away at 80
ప్రముఖ నటుడు డేవిడ్ వార్నర్ కన్నుమూత

హాలీవుడ్​ సీనియర్​ నటుడు, ది ఒమెన్‌, టైటానిక్​ చిత్రాల ఫేమ్,​ ఎమ్మీ అవార్డు గ్రహీత డేవిడ్ వార్నర్ కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమతోపాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. వార్నర్ కొద్దికాలంగా క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన మరణించారు. ఈ విషయం తెలిసిన హాలీవుడ్​ సెలబ్రెటీలు.. సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టైటానిక్ చిత్రంలో బిల్లీ జేన్ సైడ్‌కిక్ స్పైసర్ లవ్‌జాయ్‌గా నటించి గుర్తింపు పొందారు వార్నర్​. లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్‌లో శిక్షణ పొందారు. పీటర్ హాల్ దర్శకత్వం వహించిన 1965లో హామ్లెట్ టైటిల్ రోల్‌లో డేవిడ్ వార్నర్ తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే 'ది ఒమెన్', 'ట్రాన్' సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి.

డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి వచ్చి ఆరు దశాబ్దాలు అవుతోంది. 1962లో ఆయన మొదటి సినిమాలో నటించారు. ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు.

ఇదీ చదవండి: 'కోహ్లీ ఫామ్​- బాలీవుడ్​ పరిస్థితి రెండూ ఒక్కటే.. తక్కువగా అంచనా వేయలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.