తెలంగాణ

telangana

ఈ నెల 22 నుంచి తెలంగాణ తెదేపా డిజిటల్ సభ్యత్వ నమోదు

By

Published : Apr 15, 2022, 10:42 PM IST

TDP Meeting at NTR Trust Bhavan: క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో పార్టీ నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు.

Telangana TDP Meeting
Telangana TDP Meeting

TDP Meeting at NTR Trust Bhavan: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో సమావేశం నిర్వహించారు. ఉన్న క్యాడర్ నుంచి కొత్త నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ తెదేపా నిర్ణయించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ సమావేశం హైదరాబాద్​లో జరిగింది. రైతుల సమస్యలు, విద్యుత్ కష్టాలు, జీవో111 సహా వివిధ అంశాలపైనా చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు.

పార్టీ నిర్మాణం, ప్రజాసమస్యలను గుర్తించి పోరాటాలు చేసేందుకు సీనియర్ నేతలతో రెండు కమిటీలు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. తొలివిడతగా పార్టీ అధినేత 20 నియోజకవర్గాలకు ఇన్​ఛార్జులను ప్రకటించారు. వీలైనంత త్వరగా అన్ని నియోజకవర్గాలకు ఇన్​ఛార్జులను ప్రకటిస్తామని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. వారం రోజుల్లో మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి తరచుగా తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై చంద్రబాబునాయుడు దృష్టి సారిస్తారని నర్సిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:Bandi Sanjay: పచ్చని పాలమూరు ఎక్కడుందో కేటీఆరే చెప్పాలి: బండి సంజయ్‌

ABOUT THE AUTHOR

...view details