తెలంగాణ

telangana

'ఆర్థిక వ్యవస్థ కుదేలైనా.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం'

By

Published : Feb 11, 2022, 11:49 AM IST

Retail Inflation: కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. కానీ కేంద్రం తీసుకున్న నియంత్రణ చర్యల కారణంగా రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని కేవలం 6.2 శాతానికే పరిమితం చేసినట్లు పేర్కొన్నారు.

nirmala sitaraman
నిర్మలా సీతా రామన్

Retail Inflation: కొవిడ్​ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. అయితే ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6.2 శాతానికి నియంత్రించగలిగిందని పేర్కొన్నారు. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు సంబంధించిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మల సమాధానమిచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ పన్నుల అంచనాతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తుందని అన్నారు. స్థిరమైన, ఆర్థిక పునరుద్ధరణే ప్రస్తుత బడ్జెట్ లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులు గుర్తు చేశారు నిర్మల. గత ప్రభుత్వం పనితీరుతో పోల్చితే రిటైల్​ ద్రవ్యోల్బణం తక్కువే అని చెప్పారు. 2008-09లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 9.1 శాతంగా ఉందని గుర్తు చేశారు. అయితే కొవిడ్​ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినా కానీ ప్రస్తుతం ఆది 6.2 శాతంగానే ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు కరోనా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు చెప్పారు నిర్మల. కొవిడ్​తో సుమారు రూ. 9.57 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు ఈ నష్టం కేవలం రూ. 2.12 లక్షల కోట్లేనని పేర్కొన్నారు.

మహమ్మారి సమయంలో యునికార్న్‌లను సృష్టించడానికి ప్రభుత్వం స్టార్టప్‌లను కూడా ప్రోత్సహించిందని సీతారామన్ అన్నారు.

ఇదీ చూడండి:

'అగ్రదేశాల కంటే వేగంగా ఎదుగుతున్నాం.. పైచేయి మనదే'

ABOUT THE AUTHOR

...view details