తెలంగాణ

telangana

TDP Protests in Hyderabad : చంద్రబాబు అక్రమ అరెస్ట్​కు నిరసనగా.. ఎన్టీఆర్​ ట్రస్ట్​ భవన్​లో దీక్ష

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 4:11 PM IST

Updated : Oct 2, 2023, 5:08 PM IST

TDP Dharna in Hyderabad : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్​ భవన్‌ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో.. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని నందమూరి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

TDP Protests at NTR Trust Bhavan
TDP Dharna in Hyderabad

TDP Protests at NTR Trust Bhavan :చంద్రబాబుపై(CBN Arrest) పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేసి.. విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​కు వ్యతరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ ట్రస్ట్​భవన్​(NTR Trust Bhavan) వద్ద చంద్రబాబు అక్రమ అరెస్ట్​కువ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు.

TDP Motha Mogiddam Program Telangana : చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలంగాణలో 'మోత మోగింది'

TDP Dharna Aganist CBN Arrest : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ ఆధ్వర్యంలో.. హైదరాబాద్​లో ఉదయం 9 గంటల నుంటి సాయంత్రం 5 గంటల వరకూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, గారపాటి శ్రీనివాస్‌, చలసాని చాముండేశ్వరి, నారా రోహిత్‌ తల్లి ఇందిర, తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, నందమూరి జయశ్రీ, సుధ, శిల్ప, దీక్షిత, రాహుల్‌, తారకరత్న కుమార్తె నిష్క తదితరులు పాల్గొన్నారు.

CBN Supporters Protests in Telangana :ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయమైన పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వియూ స్టాండ్‌ విత్‌ చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఎన్టీఆర్​ఘాట్‌ వద్ద ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన టీడీపీ నేత నందమూరి సుహాసినిని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

TDP Protests at Bhupalapally : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకుని.. జయశంకర్ భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని సుభాష్ కాలనీలో గాంధీజీ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడుపై ఎవరెన్ని కుట్రలు చేసిన ధర్మబలంతో.. కడిగిన ముత్యంలా, మచ్చలేని చంద్రునిలా జైలు నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు మద్ధతుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు.. సత్యమేవ జయతే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై నిరసన తెలిపారు. న్యాయస్థానాలపై తమకు అపార నమ్మకం ఉందని, చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటకు వస్తారని పేర్కొన్నారు. జగన్​కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని దుయ్యబట్టారు.

TDP Dharna at Bhadradri Kothagudem :ఇల్లందులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబుకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లటి వస్త్రాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టులను నిరసిస్తూ నినాదాలు చేస్తూ.. వైసీపీ పాలన, సీఎం జగన్ తీరు సైకోను తలపిస్తుందని నినాదాలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు.

Muralimohan on CBN Arrest :ఎన్టీఆర్ భవన్‌లో నందమూరి కుటుంబసభ్యుల నిరాహార దీక్షకు మురళీ మోహన్​, పనబాక లక్ష్మీ సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్​పై పోరాడుతున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మిణీలకు మహిళల మద్దతు భారీగా పెరుగుతోందన్నారు. నేడు తెలుగు వారికి చంద్రగ్రహణం పట్టిందని.. ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్​కు దక్కుతుందని విమర్శించారు. 2019లో చంద్రబాబు గెలుచుంటే పోలవరం, అమరావతి నిర్మాణాలు పూర్తయ్యేవని పేర్కొన్నారు. 2024లో మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

"రాజకీయ కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడును అరెస్ట్​ చేశారు. అన్యాయంగా నిర్బంధించి జైలులో పెట్టారు. ఆంధ్రప్రదేశ్​లో జగన్​ పాలన అంతానికి సమయం ఆసన్నమైంది. సైకో జగన్ పాలన పోయి.. సైకిల్​ పాలన రావాలి".- నందమూరి సుహాసిని

TDP Protests in Hyderabad చంద్రబాబు అక్రమ అరెస్ట్​కు నిరసనగా.. ఎన్టీఆర్​ ట్రస్ట్​ భవన్​లో దీక్ష

Chandrababu Initiation in Jail: అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున జైలులో చంద్రబాబు దీక్ష: అచ్చెన్నాయుడు

Harish Rao on Chandrababu Arrest : 'ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం'

Last Updated :Oct 2, 2023, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details