తెలంగాణ

telangana

పంత్​కు రూ.4వేలు తిరిగిచ్చిన 'ఆ ఇద్దరు'.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి!

By

Published : Jan 2, 2023, 8:47 PM IST

Updated : Jan 2, 2023, 9:13 PM IST

పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతడిని ఆస్పత్రికి తరలించేందుకు సాయపడ్డారు ఇద్దరు యువకులు. పంత్​ కారులో నుంచి రూ.4 వేల నగదును తీసి భద్రపరిచారు. తాజాగా వాటిని పోలీసులకు అందించారు. వీరి చేసిన పనిపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

rishabh pant accident
రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం

భారత స్టార్ క్రికెటర్ రిషభ్​ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతడికి ఇద్దరు యువకులు సాయపడ్డారు. వారే రజత్ కుమార్​, నిషు కుమార్​. అంతే కాకుండా రిషభ్ కారు కాలిపోతున్న సమయంలో క్రికెటర్ వస్తువులు, నగదును ఇద్దరూ బయటకు తీశారు. అలా ప్రమాద సమయంలో కారులో నుంచి తీసిన రూ.4వేలను పోలీసులకు ఇద్దరు యువకులు అందించారు. వీరు చేసిన పనిపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే వీరిద్దరూ మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్​ను పరామర్శించారు.

రిషభ్​ను కాపాడిన రజత్​ కుమార్​, నిషు కుమార్

ప్రమాదానికి గురైన తర్వాత రిషభ్ పంత్​ను చూసేసరికి అతడి పరిస్థతి విషమంగా ఉంది. అప్పుడు అక్కడ సుశీల్ అనే బస్సు డ్రైవర్​, కండక్టర్​ పరమ్‌జీత్‌ అంబులెన్స్​కు కాల్ చేశారు. ప్రమాదానికి గురైన వ్యక్తి పంత్​ అని మాకు తెలీదు. కానీ అతడి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాం. పంత్ శరీరంపై దుప్పటి వేసి.. అంబులెన్స్​లోకి ఎక్కించాం.
-- యువకులు

మరోవైపు.. పంత్‌ ఆరోగ్యంపై దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ స్పందించాడు. పంత్‌ కోలుకుంటున్నాడని తెలిపాడు. 'పంత్‌ ఆరోగ్యం మెరుగవుతోంది. ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆదివారం సాయంత్రం అతడిని ప్రైవేటు వార్డుకు మార్చారు. మరింత కోలుకునే వరకు దెహ్రాదూన్‌ అసుపత్రిలోనే చికిత్స ఉంటుంది. ఇప్పటికే నుదుటికి సంబంధించి స్వల్ప ప్లాస్టిక్‌ సర్జరీని వైద్యులు చేశారు. కాలి లెగ్మెంట్‌ చికిత్స కోసం విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది' అని శర్మ వెల్లడించాడు.

డిసెంబర్‌ 30వ తేదీ తెల్లవారుజామున భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ దిల్లీ నుంచి కారులో రూర్కీకి వెళ్తుండగా నార్సన్‌ సరిహద్దుల్లో ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న హరియాణా రోడ్‌వేస్‌ బస్సు డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌, కండక్టర్‌ పరమ్‌జీత్‌ వెంటనే కారు వద్దకు వెళ్లి పంత్‌ను దాని నుంచి బయటకు తీసుకొచ్చారు. అతడు బయటపడిన 5-7 సెకన్లలోపే కారు మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుపోయింది.

Last Updated :Jan 2, 2023, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details