తెలంగాణ

telangana

డిసెంబర్‌ 3న ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుంది: రేవంత్‌ రెడ్డి

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 6:38 PM IST

Updated : Nov 30, 2023, 9:05 PM IST

Revanth reddy
Revanth reddy

18:31 November 30

డిసెంబర్‌ 3న ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుంది: రేవంత్‌ రెడ్డి

డిసెంబర్‌ 3న ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుంది రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Comment on Telangana Election Polling 2023 :డిసెంబరు 3న ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తెలిపారు. తెలంగాణకు పదేళ్లుగా పట్టిన పీడ తొలగిపోనుందన్నారు. ఓటమి ఖాయమని తెలిసినప్పుడే కేసీఆర్‌ నియోజకవర్గం మార్చారని ఆరోపించారు. ఎన్నికల పోలింగ్‌(Election Polling) ముగిసిన అనంతరం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్‌ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ చైతన్యవంతమైందని కామారెడ్డి ప్రజలు నిరూపించారని రేవంత్‌రెడ్డి హర్షించారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబరు 3కు ప్రత్యేక స్థానం ఉందని.. ఆరోజే శ్రీకాంత్‌చారి తుదిశ్వాస విడిచారన్నారు. శ్రీకాంత్‌చారి ఘటనతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తు చేశారు. డిసెంబరు 3న దొరలు తెలంగాణ అంతమై.. ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల చైతన్యం మీద తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

ఓటేసిన రాజకీయ ప్రముఖులు - విద్యావంతులంతా తమ బాధ్యత నిర్వర్తించాలని పిలుపు

బీఆర్‌ఎస్‌ పార్టీకి 25 సీట్లు మాత్రమే : బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకు 25 కంటే ఒక్క సీటు కూడా దాటదని.. సునామీ వస్తే.. గడ్డపారలే కొట్టుకుపోతాయి.. గడ్డిపోచ ఓ లెక్కా అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో పోలింగ్‌ ముగియగానే కేసీఆర్‌ వచ్చేవారు.. కానీ ఓటమి ఖాయమని తెలిసే కేసీఆర్‌ ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ కూడా త్వరలోనే అమెరికాకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. అధిష్ఠానం సూచన ప్రకారం సీఎల్పీ సమావేశం(CLP Meeting) నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సీఎల్పీలో చర్చించి ప్రభుత్వ ఏర్పాటు తేదీని నిర్ణయిస్తామని తెలిపారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఎంఐఎం ప్రస్తుతం బీజేపీతో ఉందని.. అందుకే మైనార్టీలను ప్రభుత్వంలో కలుపుకొని పోతామని అన్నారు. మెజార్టీల పట్ల ఉన్న విధానమే మైనార్టీల పట్లు ఉంటుందని మాటిచ్చారు. తెలంగాణ గెలుపులో కాంగ్రెస్‌ అగ్రనాయకత్వానిది కీలకపాత్ర అని చెప్పారు.

"అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తాం. ప్రజలకు మేము పాలకులం కాదు.. సేవకులం. ఈ తెలంగాణ కుటుంబానికి మొదటి, చివరి శత్రవు కేసీఆర్‌ కుటుంబంలోని ఆ నలుగురు మాత్రమే. మిగిలిన వాళ్లంతా మనవాళ్లే.. ఏదో విధిలేని పరిస్థితిలో అక్కడకు వెళ్లారు. సునామీ వచ్చినప్పుడు గడ్డపారలే కొట్టుకుపోతాయి.. ఇక గడ్డిపోచ ఎంత. సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక పదవి ఇవ్వబోతున్నాం."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Telangana Assmebly Elections 2023 : బీఆర్‌ఎస్‌ నేతలది మేకపోతు గాంభీర్యమని.. ప్రజలంటే వారికి చిన్నచూపు ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు ఈరోజు నుంచే సంబురాలు చేసుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్‌ వ్యవహరించారని ధ్వజమెత్తారు. పారదర్శక ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌(Congress) పార్టీ ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో విపక్షాల అభిప్రాయాలకు విలువ ఉంటుందని వివరించారు. కేసీఆర్​లాగా నిరంకుశంగా కాంగ్రెస్‌ నేతలు ఉండరన్నారు. ప్రజల సమస్యలు చూపించే మీడియాకు కూడా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. మేం పాలకులుగా ఉండమని.. సేవకులుగా ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు.

చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​.. ఓటింగ్​ శాతం ఎంతంటే?

మా బాధ్యతగా మేం ఓటు వేశాం - మరి మీరూ?

Last Updated : Nov 30, 2023, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details