ETV Bharat / bharat

పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు - లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 11:08 AM IST

Updated : Nov 30, 2023, 12:42 PM IST

Clashes in Telangana Polling Stations : తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు సైతం సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. ప్రతి పౌరుడు ఎన్నికల పండుగలో పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. అధికార బీఆర్ఎస్, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Clashes in Telangana Polling Stations
Clashes in Telangana Polling Stations

పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

Clashes in Telangana Polling Stations : తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) ప్రశాంతంగా జరుగుతుండగా.. కొన్నిచోట్ల చెదురుమదురు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని విజయమేరి పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నాయకుల మధ్య గొడవ చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

జనగామలోని 245వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, సీపీఐ, బీజేపీ కార్యకర్తలు,.. బీఆర్ఎస్‌కు మధ్య ఘర్షణ నెలకొంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పార్టీ నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ వర్గీయుల మధ్య గొడవ జరిపింది. ఈ నేపథ్యంలో పోలీసుల లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అడుగడుగునా పోలీసుల నిఘా - లక్షమంది బలగంతో పటిష్ఠ బందోబస్తు

Congress and BRS Clashes at Polling Stations : జోగులాంబ గద్వాల జిల్లా.. ఐజా ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద (Clashes in Telangana) వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ నాయకులు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్‌ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని.. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని హస్తం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ భారత్ రాష్ట్ర సమితి, హస్తం పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఓటు వేయడానికి ఫ్రీగా ర్యాపిడో బుక్​ చేసేయ్​ - ఓటింగ్​ శాతాన్ని పెంచేయ్​

Telangana Assembly Elections Polling 2023 : ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలో బీఎల్ఓలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు.. సంబంధిత బీఎల్ఓని బయటికి పంపటంతో వివాదం సద్దుమణిగింది.

కామారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం : కామారెడ్డిలో బాలుర పాఠశాల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికేతరుల వాహనాలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నాయని భారత్ రాష్ట్ర సమితి నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.

Telangana Assembly Elections 2023 : మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్ మండలంలో హస్తం పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి గులాబీ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ వారు ఆరోపించారు. వికారాబాద్ జిల్లా చౌడపూర్‌లో కాంగ్రెస్- భారత్ రాష్ట్ర సమితి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల మధ్య అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మీ ఓటు తెలంగాణ బతుకు చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాలి - రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల సందేశం

పోలింగ్ కేంద్రాలకు కరెంటు కష్టాలు - చీకటిలోనే ఓటింగ్​

Last Updated : Nov 30, 2023, 12:42 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.