తెలంగాణ

telangana

దళిత బాలుడిపై దారుణం.. గణేశుడి​ విగ్రహాన్ని తాకాడని మూకదాడి

By

Published : Sep 10, 2022, 8:15 AM IST

గణేశుడి ప్రతిమను తాకినందుకు ఓ దళిత బాలుడిపై కొందరు వ్యక్తులు మూకదాడికి పాల్పడ్డారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Dalit minor boy
దళిత బాలుడిపై దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. గణేశుడి ప్రతిమను తాకినందుకు ఓ దళిత బాలుడిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇదీ జరిగింది.. కన్నౌజ్‌ జిల్లాలోని సదర్‌ కొత్వాలి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. దళిత వర్గానికి చెందిన సన్నీ గౌతమ్‌ అనే బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ మండపంలోకి వెళ్లి గణేశుడి ప్రతిమ పాదాలను తాకే యత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మండపం నిర్వాహకుడు బబ్బన్‌ గుప్త తన ఇద్దరు కుమారులతో కలసి బాలుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాధిత బాలుడికి గాయాలయ్యాయి. దీనిపై దళిత బాలుడి తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ బాలుడు మద్యం తాగి మండపంలోకి రావడం వల్ల గొడవ జరిగిందని బబ్బన్‌ గుప్త కుటుంబం తెలిపింది.

యూపీలో ఇదే తరహాలో మరో ఘటన జరిగింది. జమున్హా తహసీల్‌ కాంప్లెక్స్‌కు వెళ్లిన ఓ దళిత వృద్ధుడు, అతని కుమారుడు నీరు తాగేందుకు అక్కడున్న సీసాను తాకడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు అధికారులు వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details