తెలంగాణ

telangana

తీవ్ర తుపానుగా 'జవాద్​'.. పూరీకి 490 కి.మీ దూరంలో..

By

Published : Dec 4, 2021, 10:11 AM IST

Jawad Cyclone IMD: జవాద్.. తీవ్ర తుపానుగా మారి ముంచుకొస్తోంది. ఒడిశాలోని పారదీప్​కు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. మరోవైపు తుపాను కారణంగా యూజీసీ- నెట్​, ఐఐఎఫ్​టీ ప్రవేశ పరీక్షలు ఒడిశా, ఏపీ, బంగాల్​లోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో వాయిదా పడ్డాయి.

జవాద్ తీవ్ర తుపాను
Cyclone Jawad

Jawad Cyclone IMD: తీవ్ర తుపానుగా మారిన 'జవాద్'.. ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్‌కు 490 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.

"జవాద్ తుపాను గోపాల్​​పుర్​కు 340 కిలోమీటర్లు, పూరీకి 410 కిలోమీటర్ల దూరంలో ఉంది. గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయవ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా దిశ మార్చుకుని రానున్న 12గంటల్లో ఒడిశా పూరీ తీరానికి చేరుకుంటుంది. ఆదివారం రాత్రికి క్రమంగా బలహీన పడి వాయుగుండంగా మారుతుంది."

-- భారత వాతావరణశాఖ

తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

Jawad Andhra Pradesh: జవాద్ తుపాను దృష్ట్యా.. 11ఎన్​డీఆర్​ఎఫ్, 5ఎస్​డీఆర్​ఎఫ్​, 6 కోస్ట్ గార్డు, 10 మెరైన్ పోలీస్ బృందాలను మోహరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తీరప్రాంతంలోని 54,008 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

జవాద్​ తుపాను కారణంగా ఆదివారం జరగనున్న యూజీసీ- నెట్, ఐఐఎఫ్​టీ ప్రవేశ పరీక్షలు ఒడిశా, ఏపీ, బంగాల్​లోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి:'సవాళ్లను ఎదుర్కొనేందుకు నేవీ సదా సన్నద్ధం'

ABOUT THE AUTHOR

...view details