తెలంగాణ

telangana

దేశంలో మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 30వేల మందికి వైరస్​

By

Published : Sep 16, 2021, 9:38 AM IST

Updated : Sep 16, 2021, 9:51 AM IST

దేశంలో కరోనా కేసుల (Corona cases in India) సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 30,570 మంది కొవిడ్​​(Corona Update) బారినపడ్డారు. మరో 431 మంది వైరస్​తో(Covid-19)​ మరణించారు.

Covid-19 cases
కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసుల (Corona cases in India) సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. కొత్తగా 30,570 మందికి వైరస్ (Corona Update) సోకింది. మరో 431 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 17,681 మంది కొవిడ్​​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,33,47,325
  • మొత్తం మరణాలు: 4,43,928
  • మొత్తం కోలుకున్నవారు: 3,25,60,474
  • యాక్టివ్ కేసులు: 3,42,923

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 54.77 లక్షలకుపైగా కొవిడ్ పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వ్యాక్సినేషన్

దేశంలో బుధవారం ఒక్కరోజే 64,51,423 టీకా డోసులు పంపిణీ(covid vaccination) చేశారు. మొత్తం టీకా డోసుల సంఖ్య 76,57,17,137 కు పెరిగింది.

ఇదీ చూడండి:Covid Endemic: భారత్‌లో కరోనా.. 6 నెలల్లో ఎండెమిక్‌ దశలోకి..?

Last Updated : Sep 16, 2021, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details