తెలంగాణ

telangana

వాట్సాప్​ యూజర్లకు గుడ్ న్యూస్ - ఇకపై వెబ్ ​వెర్షన్​​లోనూ 'చాట్​ లాక్' ఫీచర్​!

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 2:34 PM IST

Whatsapp Chat Lock Feature : వాట్సాప్​ యూజర్స్​కు గుడ్​న్యూస్​. ఇప్పటి వరకు యాప్​కు మాత్రమే పరిమితమైన చాట్​లాక్​ ఫీచర్, త్వరలో​ వెబ్​వెర్షన్​లోనూ రానుంది. దీనితో యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత చేకూరనుంది.

Whatsapp web Chat Lock Feature
Whatsapp Chat Lock Feature

Whatsapp Chat Lock Feature :యూజర్ల ప్రైవసీని మరింతగా పెంచేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. ఇందులో భాగంగా గతేడాదిలో యాప్‌ యూజర్ల కోసం ‘చాట్‌ లాక్‌’ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆ చాట్​లాక్​ ఫీచర్​ను వెబ్ వెర్షన్‌లోనూ అందించాలని చూస్తోంది. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే 'వాబీటా ఇన్ఫో' తన బ్లాగ్‌లో పేర్కొంది.

వాట్సప్‌ వెబ్‌ వెర్షన్‌లో 'చాట్‌ లాక్‌' ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుందని వాబీటా పేర్కొంది. ఫీచర్‌కి సంబంధించిన ఫొటోను సైతం తన బ్లాగ్​లో పంచుకుంది. దాన్ని పరిశీలిస్తే వాట్సప్‌ వెబ్‌లో కొత్తగా డిజైన్‌ చేసిన సైడ్‌బార్‌ ఎడమవైపు కనిపిస్తుంది. యాప్​కు మాత్రమే పరిమితమైన చాట్​ లాక్​ ఫీచర్​ను వెబ్​వెర్షన్​లోకి తీసుకువచ్చేందుకు బీటా వెర్షన్​లో పరీక్షిస్తున్నారు. సైడ్​బార్​లోనే 'చాట్‌ లాక్‌' ఐకాన్‌, ఆర్కైవ్‌ చాట్స్‌, స్టార్డ్‌ మెసేజెస్‌ ఐకాన్‌ ఉన్నాయి. సాధారణంగా మొబైల్ వాట్సప్‌లో ఈ ఫీచర్‌ సాయంతో ఒకసారి చాట్‌కు లాక్‌ చేస్తే, కేవలం యూజర్‌ మాత్రమే తన ఫింగర్‌ ప్రింట్‌ లేదా పాస్‌కోడ్‌ ఉపయోగించి దాన్ని ఓపెన్ చేయడానికి వీలవుతుంది. లాక్‌ చేసిన చాట్‌ను ఇతరులెవరూ తెరవడం కుదరదు. ఇదే ఫీచర్​ను ఇప్పుడు వాట్సాప్ వెబ్​ వెర్షన్​లోనూ తీసుకువస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే వెబ్ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి రానుంది.

'వాట్సాప్​లోనూ పీపుల్ నియర్​బై షేర్​'
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్​ త్వరలో 'నియర్​బై షేర్'​ ఫీచర్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇదే కనుక అందరికీ అందుబాటులోకి వస్తే, వాట్సాప్​ యూజర్లు తమ సమీపంలోని వ్యక్తులకు చాలా సేఫ్​గా ఫైల్స్, ఫొటోస్​, వీడియోస్​ పంపించడానికి వీలవుతుంది.

గతంలో చాలా మంది యూజర్లు ఫొటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్ షేరింగ్‌ కోసం 'షేర్‌ ఇట్‌' అనే యాప్‌ను ఉపయోగించేవారు. దానిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనితో గూగుల్‌ తమ యూజర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో 'నియర్‌బై షేర్‌' ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో ఒకేసారి చాలా మందికి ఫైల్స్‌ పంపవచ్చు. ముఖ్యంగా ఎలాంటి కేబుల్స్‌, నెట్‌వర్క్‌ అవసరం లేకుండా డివైజ్‌ టు డివైజ్‌ కనెక్టివిటీతో ఫైల్స్‌ షేర్‌ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీని తమ యూజర్లకు కూడా అందించాలని వాట్సాప్​ సిద్ధమవుతోంది.

త్వరలో వాట్సాప్ లుక్​ ఛేంజ్​ - మీకు నచ్చిన థీమ్ కలర్స్​ మార్చుకునే అవకాశం!

వాట్సాప్​లో మిమ్మల్ని ఎవరు బ్లాక్​ చేశారో తెలుసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్​ మీ కోసమే!

ABOUT THE AUTHOR

...view details