ETV Bharat / science-and-technology

త్వరలో వాట్సాప్ లుక్​ ఛేంజ్​ - మీకు నచ్చిన థీమ్ కలర్స్​ మార్చుకునే అవకాశం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 1:26 PM IST

WhatsApp testing App Color feature
WhatsApp Theme Color Feature

WhatsApp Theme Color Feature In Telugu : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్​. త్వరలో వాట్సాప్​ థీమ్​ను మీకు నచ్చిన రంగు​లోకి మార్చుకునే అవకాశం రానుంది. ప్రస్తుతం దీనిని ఐవోఎస్ బీటా వెర్షన్​లో టెస్ట్ చేస్తున్నారు. అయితే దీనిని ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు మీ కోసం.

WhatsApp Theme Color Feature : ఇటీవల వాట్సాప్​ తన ఆండ్రాయిడ్​, ఐవోఎస్​ యాప్​ల్లో అనేక యూజర్ ఇంటర్ఫేస్​ (UI) మార్పులు చేసింది. ఛానల్స్ క్రియేషన్​, మల్టీ అకౌంట్ సపోర్ట్​ లాంటి సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. త్వరలో తమ ఐవోఎస్​ యూజర్ల కోసం థీమ్ కలర్స్​ మార్చుకునే వెసులుబాటును కల్పించాలని నిర్ణయించుకుంది. అందుకు కావాల్సిన బీటా వెర్షన్​ను ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది.

బోలెడు కలర్ ఆప్షన్స్​
ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు కేవలం లైట్​, డార్క్ మోడ్​లను మాత్రమే మార్చుకోగలుగుతున్నారు. అయితే వాట్సాప్​ బ్రాండింగ్ రంగు​ అయిన ప్రైమరీ గ్రీన్ కలర్​ మాత్రం మారడం లేదు.

WaBetaInfo ప్రకారం, వాట్సాప్​ ఐవోఎస్ బీటా వెర్షన్​ 24.1.10.70లో 'యాప్​ కలర్​' ఫీచర్​ను టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతానికి గ్రీన్​, బ్లూ, వైట్​, పింక్​, పర్పుల్​ కలర్ ఆప్షన్లను మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కలర్ ఆప్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఫీచర్ కనుక​ అందుబాటులోకి వస్తే, యూజర్లు వాట్సాప్​ అపీరియన్స్​ను పూర్తిగా మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాదు, చాట్ విండోలో బబుల్ రంగును మార్చడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది.

ఐవోఎస్ యూజర్లకు మాత్రమేనా?
ప్రస్తుతానికి వాట్సాప్ 'థీమ్ కలర్'​ ఫీచర్​ అభివృద్ధి దశలోనే ఉంది. ఐవోఎస్ బీటా యూజర్లకు కూడా ఇది అందుబాటులో లేదు. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెస్తారా? లేదా? అనేది తెలియదు. అయితే, వాట్సాప్​ ఎప్పటికప్పుడు తమ యూజర్ల కోసం బెస్ట్ ఫీచర్స్​ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. కనుక థీమ్ కలర్​ను మార్చుకునే ఈ ఫెసిలిటీని ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా కల్పించవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

వాట్సాప్ అప్​కమింగ్ ఫీచర్స్
వాట్సాప్​ ప్రస్తుతం న్యూ యూజర్​ నేమ్​, ఆడియో షేరింగ్​ ఫీచర్లను కూడా టెస్ట్ చేస్తోంది. త్వరలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

న్యూ యూజర్​ నేమ్ ఫీచర్​
WhatsApp New User Name Feature Benefits : వాట్సాప్​లో ఇప్పటి వరకు యూజర్ల ఫోన్​ నంబర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ త్వరలో మీకు నచ్చిన యూజర్​ నేమ్​ పెట్టుకునే అవకాశం లభించవచ్చు. ఒక వేళ ఇది అందుబాటులోకి వస్తే అనేక లాభాలు ఉంటాయి. అవేంటంటే?

1. యూజర్ నేమ్ ఉండడం వల్ల ఎవరైనా మిమ్మల్ని సులువుగా గుర్తుపడతారు. ముఖ్యంగా సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఈజీగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గ్రూప్​ పార్టిపేషన్​కు కూడా అవకాశం లభిస్తుంది.

2. యూజర్​ నేమ్ ఉండడం వల్ల మీ వ్యక్తిగత భద్రతకు, ప్రైవసీకి ఆటంకం ఏర్పడదు.

3. ఫోన్ నంబర్ల కంటే, యూజర్​ నేమ్స్ షేర్​ చేయడం సులువు అవుతుంది. వివిధ డిజిటల్ ప్లాట్​ఫామ్స్​లో మీ యూజర్లను అనుసంధానం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఆడియో షేరింగ్​ ఫీచర్​
WhatsApp Audio Sharing Feature Benefits : వాట్సాప్​లో వీడియో కాల్స్​ చేసినప్పుడు, స్క్రీన్ షేర్​ చేస్తే ఎలాంటి ఆడియో వినిపించదు. దీని వల్ల ప్రెజెంటేషన్​, మీడియా ప్లేబ్లాక్​లకు ఇబ్బంది ఏర్పడుతోంది. అందుకే వాట్సాప్​ ఆడియో షేరింగ్ ఫీచర్​ను కూడా టెస్ట్ చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే, వాట్సాప్​ వీడియో కాల్​లో స్క్రీన్ షేర్​ చేసినప్పుడు బ్యాక్​గ్రౌండ్ ఆడియో కూడా వినిపిస్తుంది. దీని వల్ల అనేక లాభాలు ఉంటాయి. అవి ఏమిటంటే?

1. గ్రూప్​ వీడియో కాల్​ చేసినప్పుడు, పార్టిసిపెంట్స్​ అందరూ, షేర్ చేసిన మ్యూజిక్​ను ఎంజాయ్ చేయవచ్చు.

2. ఆన్​లైన్​ క్లాస్​లు, ప్రెజెంటేషన్​లు నిర్వహించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

3. వీడియో కాల్​లోనే మూవీస్​, షోస్​ ఎంజాయ్​ చేయవచ్చు.

వాట్సాప్​లో మిమ్మల్ని ఎవరు బ్లాక్​ చేశారో తెలుసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్​ మీ కోసమే!

50 ఏళ్ల తర్వాత అమెరికా మూన్ మిషన్- ప్రయోగించిన గంటలకే సమస్య- ల్యాండింగ్ కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.