ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో కొత్త టెక్ట్స్ ఫార్మాట్లు- అక్షరాలకు స్టైల్ నేర్పేయండిక!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 12:35 PM IST

Whatsapp Text Formatting New Tricks : వాట్సాప్​లో టెక్ట్స్ బోల్డ్ చేయడం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇటాలిక్, స్ట్రైక్ థ్రూ ఆప్షన్లను సైతం వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు టెక్ట్స్ ఫార్మాటింగ్ కోసం మరికొన్ని ఆప్షన్లు రాబోతున్నాయి. అవేంటో తెలుసా?

WhatsApp new formatting options
WhatsApp new formatting options

Whatsapp Text Formatting New Tricks : వాట్సాప్​లో కొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు బోల్డ్, ఇటాలిక్, స్ట్రైక్​ థ్రూ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉండగా ఇంకొన్ని కొత్త ఫార్మాట్లను వాట్సాప్ తీసుకొస్తోంది. ఐఓఎస్ వినియోగదారులకు ఇది ఇప్పటికే అందుబాటులోకి రాగా- త్వరలోనే ఆండ్రాయిడ్ బీటా యూజర్లు దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కొత్తగా చేర్చిన ఫార్మాట్లతో వాట్సాప్​లో ఏడు టెక్ట్స్ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినట్లైంది.

కొత్త ఫార్మాట్లు ఇవే
కోడ్ బ్లాక్స్:
Whatsapp Text Code : కోడింగ్ టెక్ట్స్ పంపించుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. మోనోస్పేస్ ఫాంట్స్​ను ఇది చక్కగా చూపిస్తుంది. సాధారణంగా వాట్సాప్ సెంటెన్స్​లు ఎక్కడ బ్రేక్ అవుతాయో మనం చెప్పలేం. కానీ ఈ కోడ్ బ్లాక్స్ ద్వారా టెక్ట్స్​ను మనకు కావాల్సిన విధంగా పంపించుకోవచ్చు. డెవలపర్లు కోడ్ షేర్ చేసుకోవడానికి ఇది మంచి మార్గం. కోడ్ బ్లాక్ పంపించాలంటే సింపుల్​గా మీ టెక్ట్స్​కు ముందు, వెనక బ్యాక్​టిక్ (`) సింబల్​ను ఉంచితే సరిపోతుంది.

WhatsApp new formatting options
కొత్త ఫార్మాట్లపై వాట్సాప్ బీటా ఇన్ఫో వెబ్​సైట్ విడుదల చేసిన స్క్రీన్​షాట్

కోట్ బ్లాక్స్:
Whatsapp Quote Block : మనకు వచ్చిన లాంగ్ మెసేజ్​​లోని కొంత భాగానికి మాత్రమే రిప్లై ఇవ్వాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. కోట్ బ్లాక్స్ పంపించినప్పుడు మనం పంపే మెసేజ్ కాస్త హైలైట్ అయి కనిపిస్తుంది. చూడటానికి అనుకూలంగా ఉండటం సహా మెసేజ్​లోని కాంటెక్ట్స్​కు తగ్గట్టుగా రిప్లై ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కోట్ బ్లాక్ పంపించాలంటే టెక్ట్స్​కు ముందు గ్రేటర్​ దెన్ (>) సింబల్ పెడితే సరిపోతుంది.

లిస్ట్​లు:
సమాచారాన్ని లిస్ట్​ల రూపంలో పంపించాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. టెక్ట్స్​ను ర్యాంకుల వారీగా చెప్పడానికి, పాయింట్ల వారీగా సమాచారం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. బుల్లెట్ లిస్ట్, నంబర్ లిస్ట్ ఆప్షన్లను వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టింది. బుల్లెట్ లిస్ట్ పంపించాలనుకుంటే ప్రతి లైన్​కు ముందు స్టార్(*) లేదా మైనస్(-) సింబల్స్​ను పెడితే సరిపోతుంది. నంబర్ లిస్ట్ కావాలనుకుంటే ప్రతి లైన్​కు ముందు నంబర్​ను ఎంటర్ చేయాలి. లాంగ్ మెసేజ్​లు పంపించుకునే సమయంలో టెక్ట్స్​ ఫార్మాట్ చెదిరిపోకుండా ఉండటానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సూచనలు, లాభ-నష్టాలు, ఛాయిస్​లు/ఆప్షన్లు, టాస్క్​ల గురించి వివరించేందుకు ఈ లిస్ట్​లు బాగా ఉపయోగపడతాయి.

ఇవి కూడా తెలుసుకోండి
ఇప్పటికే వాట్సాప్​లో కొన్ని టెక్ట్స్​ ఫార్మాటింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బోల్డ్: టెక్ట్స్​ను బోల్డ్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. ఓ పదాన్ని లేదా లైన్​ను హైలైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లైన్/పదానికి ముందు, వెనక స్టార్(*) సింబల్​ను పెట్టడం (*ఇలా రెండు స్టార్ సింబళ్ల మధ్య టెక్ట్స్​ ఉంచాలి*) ద్వారా టెక్ట్స్​ను బోల్డ్ చేయవచ్చు.

ఇటాలిక్:
కాస్త వంగినట్టు ఉండే టెక్ట్స్​ కోసం ఇటాలిక్​ను ఉపయోగించుకోవచ్చు. రెండు అండర్​స్కోర్ (_) సింబల్స్ మధ్య టెక్ట్స్​ను ఉంచితే ఇటాలిక్ ఫాంట్ వచ్చేస్తుంది.

స్ట్రైక్ థ్రూ:
ఈ ఆప్షన్ ఉపయోగిస్తే టెక్ట్స్​పై అడ్డంగా గీత వస్తుంది. సంబంధిత టెక్ట్స్ తప్పు అని చెప్పేందుకు ఇది ఉపయోగించుకోవచ్చు. టెక్ట్స్​కు ముందు, వెనక టిల్డ్ (~) సింబల్స్ యాడ్ చేస్తే స్ట్రైక్ థ్రూ సెంటెన్స్ వచ్చేస్తుంది.

మోనోస్పేస్:
మోనోస్పేస్ ఫాంట్ కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. టెక్ట్స్​కు ముందు, వెనక మూడు బ్యాక్​టిక్ సింబల్స్​ను పెట్టడం ద్వారా (```ఉదాహరణ```) మోనోస్పేస్ ఫాంట్ పొందొచ్చు.

త్వరలో వాట్సాప్ లుక్​ ఛేంజ్​ - మీకు నచ్చిన థీమ్ కలర్స్​ మార్చుకునే అవకాశం!

వాట్సాప్​లో మిమ్మల్ని ఎవరు బ్లాక్​ చేశారో తెలుసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్​ మీ కోసమే!

వాట్సాప్​లో 'యూజర్ నేమ్' ఫీచర్​​ - ఇకపై ఫోన్ నంబర్​ షేరింగ్ బంద్​!

మీ ప్రైవేట్ చాట్స్ ఎవరూ చూడకూడదా? సింపుల్​గా 'సీక్రెట్ కోడ్' పెట్టేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.