తెలంగాణ

telangana

18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన జనసేన - AP Janasena Candidates 2024

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 11:34 AM IST

AP Janasena Candidates List 2024 : ఏపీలో జనసేన పార్టీ 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.

AP Janasena Finalized Candidates For 18 Seats
AP Janasena Candidates List 2024

AP Janasena Candidates List 2024 :ఏపీలో జనసేన పార్టీ 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ,టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది. అలాగే ఒక లోక్‌సభ అభ్యర్థిని సైతం పెండింగ్‌లో పెట్టింది.

AP MLA, MP Elections 2024 :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పేర్లు ప్రకటించారు. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి నుంచి విజయ్‌కుమార్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి వరప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించింది.

భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు పేర్లు అధికారికంగా వెల్లడించారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, రైల్వేకోడూరు నుంచి యనమల భాస్కర్‌రావు పోటీ చేయబోతున్నారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోయే విశాఖ దక్షిణ, పాలకొండ, అవనిగడ్డ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను జనసేన పెండింగ్‌లో ఉంచింది.

ఆంధ్రప్రదేశ్​లో ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం : పవన్ కల్యాణ్‌

అసెంబ్లీ అభ్యర్థులు :-

  • పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌
  • నెల్లిమర్ల - లోకం మాధవి
  • అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
  • కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ
  • రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
  • తెనాలి - నాదెండ్ల మనోహర్‌
  • నిడదవోలు - కందుల దుర్గేష్‌
  • పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు
  • యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌
  • పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
  • రాజోలు - దేవ వరప్రసాద్‌
  • తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌
  • భీమవరం - పులపర్తి ఆంజనేయులు
  • నరసాపురం - బొమ్మిడి నాయకర్‌
  • ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
  • పోలవరం - చిర్రి బాలరాజు
  • తిరుపతి - అరణి శ్రీనివాసులు
  • రైల్వే కోడూరు - డా.యనమల భాస్కరరావు

లోక్‌సభ అభ్యర్థులు :-

  • కాకినాడ - తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌

'వైఎస్సార్సీపీ' ప్రచార పిచ్చి - ప్రభుత్వ సొమ్ము వృథా - జగన్‌ బాధ్యత వహిస్తారా?

ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా- కడప లోక్‌సభ బరిలో వైఎస్ షర్మిల!

ABOUT THE AUTHOR

...view details