తెలంగాణ

telangana

తెలుగు భామల చూపు బాలీవుడ్ వైపు- అందరి చేతిలో భారీ ప్రాజెక్ట్​లే! - Telugu Heroines Bollywood Movies

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 6:49 PM IST

Telugu Heroines Bollywood Movies: సౌత్ నుంచి హిందీ పరిశ్రమకు వెళ్తున్న హీరోయిన్స్ లిస్ట్ లో ఈ నలుగురు కూడా చేరారు. వాళ్లు బాలీవుడ్​లో చేయబోతున్న సినిమాలు ఏవో తెలుసా?

Telugu Heroines Bollywood Movies
Telugu Heroines Bollywood Movies (Source: ETV Bharat)

Telugu Heroines Bollywood Movies:సౌత్​ఇండస్ట్రీకిచెందిన హీరోయిన్స్ ఇక్కడ తమ సత్తా చాటి బాలీవుడ్ వైపు చూడటం కొత్తేమి కాదు. దక్షిణాదికి చెందిన అలనాటి తార దివంగత శ్రీదేవి, రేఖ, జయప్రద బాలీవుడ్​లో టాప్ హీరోయిన్స్ అనిపించుకున్నారు. ఆ తర్వాత లిస్ట్​లోకి చాలామంది వెళ్లారు. ఇప్పుడు మరో నలుగురు కూడా ఆ లిస్ట్​లో చేరనున్నారు.

సాయి పల్లవి:ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో సాయి పల్లవి బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో జునైద్ ఖాన్ వెండితెరకు పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం విదేశీ షెడ్యూల్ షూటింగ్​లో ఈ మూవీ టీమ్ ఉంది. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన క్రేజీ ప్రాజెక్ట్ 'రామాయణం'లో సీతగా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీకి చెందిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సమంత: మొదట 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​​తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఆ తరువాత పాన్ఇండియా ఫిల్మ్ 'పుష్ప'లో ఐటమ్ సాంగ్​తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇప్పుడు 'సిటాడెల్' తో గ్లోబల్ లెవెల్​లో తన టాలెంట్ నిరూపించుకోనుంది. రస్సో బ్రదర్స్ డైరెక్షన్​లో వరుణ్ ధావన్ సరసన నటించింది సమంత.

రష్మిక: 2022లోనే 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక అంతకుముందే 'పుష్ప'తో అక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే 'గుడ్ బై', 'మిషన్ మజ్ను' సినిమాల్లో పాత్రలు పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినా గత ఏడాది సూపర్ హిట్ 'యానిమాల్' మాత్రం నటిగా మరో స్థాయికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం రెండు భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో రష్మిక నటిస్తుంది. ఒకటి సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న 'సికందర్' కాగా, మరొకటి విక్కీ కౌశల్ నటిస్తున్న హిస్టారికల్ డ్రామా 'చావా'.

కీర్తి సురేష్:'మహానటి' తర్వాత కీర్తి సురేష్ మార్కెట్ అమాంతం పెరిగింది. అప్పుడే బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల రీత్యా ఆ అవకాశాలు వేరే వాళ్లకు వెళ్లిపోయాయి. అయితే ఎట్టకేలకు కీర్తి సురేష్ బాలీవుడ్​లోకి 'బాబీ జాన్' అనే మూవీతో అడుగుపెట్టనుంది. ఈ చిత్రం మే 31న థియేటర్లలో విడుదల కానుంది.

యాక్షన్ మోడ్​లో అందాల భామలు - తుపాకీతో బాక్సాఫీస్​కు గురి పెట్టి! - Tollywood Heroine Action Movies

'ఆడిషన్స్​లో అలా చేయలేకపోయా - మా నాన్న తిట్టాక ఓకే అయ్యింది' - Kajal Aggarwal First Movie Audition

ABOUT THE AUTHOR

...view details