తెలంగాణ

telangana

రాముడికి కానుకగా 400 కేజీల తాళం- రూ.1.65 లక్షల రామాయణం ప్రదర్శన

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 1:28 PM IST

Ayodhya 400 KG Lock : అయోధ్యకు భారీ తాళం కానుకగా వచ్చింది. అలీగఢ్​కు చెందిన దంపతులు తయారు చేసిన 400 కేజీల తాళాన్ని అయోధ్యకు తీసుకొచ్చారు. మరోవైవపు, రూ.1.65 లక్షలు విలువ చేసే రామాయణాన్ని అయోధ్యలో ప్రదర్శనకు ఉంచారు.

ayodhya 400 kg lock
ayodhya 400 kg lock

Ayodhya 400 KG Lock :ప్రాణ ప్రతిష్ఠ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్య రాముడికి పెద్ద ఎత్తున కానుకలు వస్తున్నాయి. ఇప్పటికే భారీ డోలు, విల్లు, గంటను భక్తులు పంపించగా- తాజాగా అలీగఢ్ నుంచి ఓ పెద్ద తాళం కానుకగా వచ్చింది. దీని బరువు 400 కిలోలు ఉంటుందని తెలుస్తోంది. అలీగఢ్​లోని నోరంగాబాద్‌కు చెందిన సత్య ప్రకాష్‌ శర్మ, ఆయన భార్య రుక్మిణి శర్మ రెండేళ్ల క్రితం ఈ తాళాన్ని తయారు చేశారు. సత్య ప్రకాష్ శర్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ తాళాన్ని అయోధ్య రామమందిరానికి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరిక అని రుక్మిణి తెలిపింది.

400 కేజీల తాళం

తాళానికి పూజలు చేసిన అనంతరం అయోధ్యకు తీసుకొచ్చారు మహామండలేశ్వర్ అన్నపూర్ణ భారతి పూరీ అనే మహిళ. ఈ తాళం అలీగఢ్ పరిశ్రమకు ఊతమిస్తుందని చెబుతున్నారు. "అలీగఢ్ తాళాలకు ప్రసిద్ధి. అలీగఢ్​ను ప్రధాని నరేంద్ర మోదీ తాళాల నగరంగా అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో అలీగఢ్​కు ప్రాచుర్యం కల్పించేందుకు ఈ తాళాన్ని అయోధ్యకు ఇవ్వాలని నిర్ణయించాం. అక్కడికి వచ్చే దేశ, విదేశ ప్రజలు దీన్ని చూసి అభినందిస్తారు. ఇది అలీగఢ్ తాళాల పరిశ్రమకు ప్రయోజనం కలిగిస్తుంది. ఆర్థికంగా నగరానికి మంచి చేస్తుంది" అని అన్నపూర్ణ భారతి వివరించారు.

400 కేజీల తాళం
400 కేజీల తాళం
తాళానికి పూజలు చేస్తున్న భారతి పూరీ

రూ.1.65లక్షల రామాయణం
ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యలో రూ.1.65లక్షల విలువ చేసే రామాయణ ప్రతిని ప్రదర్శనకు ఉంచారు. 45 కేజీల బరువు ఉండే ఈ రామాయణం 3 బాక్సుల్లో వస్తుంది. పుస్తకాలతో పాటు స్టాండ్​ను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తయారీదారులు తెలిపారు. కవర్ మెటీరియల్​ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. బాక్స్​ స్టాండ్​ను ఎటువైపైనా తిప్పుకునేలా ఉంటుందని వివరించారు.

రూ.1.65లక్షల రామాయణం
రామాయణం

సైకిల్​పై అయోధ్యకు
అయోధ్యకు సైకిల్​పై చేరుకున్నాడు అహ్మదాబాద్​కు చెందిన 63 ఏళ్ల నీమారాం ప్రజాపతి అనే వ్యక్తి. పాదరక్షలు ధరించకుండానే సైకిల్​ తొక్కుతూ రామ జన్మభూమికి విచ్చేశాడు. '1992 నుంచి నేను కాళ్లకు చెప్పులు ధరించడం లేదు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం జరిగాకే పాదరక్షలు ధరించాలని అనుకున్నా. 20 ఏళ్ల నుంచి నేను సైక్లింగ్ చేస్తున్నా. 20 ఏళ్ల క్రితం నా తొలి యాత్రగా అమర్​నాథ్​కు వెళ్లా. ఈసారి అహ్మదాబాద్​ నుంచి సైకిల్​పై అయోధ్యకు వచ్చా. దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తా' అని ప్రజాపతి పేర్కొన్నాడు.

మరోవైపు, ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని వివిధ నగరాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గుజరాత్​లోని సూరత్​లో విద్యార్థులు రాముడి విల్లు, బాణం గుర్తు వచ్చేలా మానవహారం చేశారు. స్వామినారాయణ్ గురుకుల్ స్కూల్​లో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్ర నాగ్​పుర్​లోని ఓ పాఠశాలలో విద్యార్థులు తమ టీచర్​తో కలిసి రాముడి పాటలకు నృత్యం చేశారు. గుజరాత్​లోని శివరాజ్​పుర్ బీచ్​లో ఓ వ్యక్తి హనుమంతుడి జెండా పట్టుకొని స్కూబా డైవింగ్ చేశాడు.

'ప్రాణప్రతిష్ఠకు రండి'- అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఆహ్వానం

సైక్లింగ్, వాకింగ్, స్కేటింగ్- అయోధ్యకు భక్తుల సాహసయాత్రలు- ఇతర మతస్థులు కూడా!

ABOUT THE AUTHOR

...view details