వెయ్యి అడుగుల ఎత్తులో మహిళ.. బిక్కుబిక్కుమంటూ తీగకు వేలాడుతూ..

By

Published : Mar 31, 2022, 3:30 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

బిహార్ నలంద జిల్లా రాజ్​గీర్​లో ఓ మహిళకు పెను ప్రమాదం తప్పింది. జిప్​లైన్​ ట్రెక్కింగ్​ చేస్తున్న ఆమె 1000 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయింది. చాలాసేపు ఆమె అలానే బిక్కుబిక్కుమంటూ గడపగా.. కింద ఉన్నవారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు స్థానిక అధికారులు రంగంలోకి దిగి.. ఆమెను రక్షించారు. నేచర్ సఫారీ పార్క్​లో జిప్​లైన్​ ట్రెక్కింగ్ చేస్తున్న ఆ మహిళ ఒక స్తంభం నుంచి మరొక స్తంభం వరకు దూసుకొచ్చింది. అయితే.. అక్కడ ఆమెను పక్కకు లాగి కిందకు దింపేందుకు సిబ్బంది ఎవరూ లేరు. ఫలితంగా.. స్తంభాన్ని ఢీకొట్టి మళ్లీ వెనక్కి వెళ్లిపోయిన ఆమె.. ఇలా గాల్లోనే ఉండిపోయింది.

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.