ఆకస్మిక వర్షం.. పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన జనం.. ఏడుగురు మృతి!

By

Published : Jul 6, 2022, 3:47 PM IST

thumbnail

Cloud Burst in Manikarn Valley: హిమాచల్‌ ప్రదేశ్‌లో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. ఎడతెరిపిలేని వర్షంతో.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి ఒక్క బుధవారమే ఏడుగురు చనిపోయినట్లు సమాచారం. మలానా పవర్​ ప్రాజెక్ట్​లో పనిచేసే పదులకొద్దీ ఉద్యోగులు నీటిలో చిక్కుకోగా వారిని రక్షించారు. మణికర్ణ్​ వ్యాలీ చోజ్​ గ్రామంలో పార్వతీ నది ఉప్పొంగి.. బ్రిడ్జి ధ్వంసమైంది. జనాలు వరదలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు అధికారులు. సిమ్లాలో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.