Woman Delivery Beside Stream in Adilabad : ఆదివాసీలకు వాన కష్టాలు.. వాగు ఒడ్డునే మహిళ ప్రసవం

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 1:00 PM IST

thumbnail

Woman Delivery Beside Stream in Adilabad : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అదిలాబాద్ ఆదివాసీల కష్టాలు చెప్పనక్కర్లేదు. వారు ఎంతగా ఇబ్బందులు పడుతారో.. తాజాగా జరిగిన ఓ ఘటన మనకు మరోసారి తెలియజేస్తోంది. వాగుపై తీవ్రంగా ప్రవహిస్తుండటంతో కాలినడకన వాగు దాటి.. చివరకు వాగు ఒడ్డునే ఓ మహిళ ప్రసవించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

Woman gave Birth Beside a Lake Adilabad : జిల్లాలోని పుత్తూరు మండలంలో ఓ గర్భినీ మహిళకు వాగు ఒడ్డున పురుడు పోశారు గ్రామస్థులు. చిన్నుగూడాకు చెందిన ఓ మహిళకు పురిటి నోప్పులు రావడంతో ఆస్పత్రికి బయలుదేరారు.  ఊరి మధ్యలో ఉన్న వాగు తీవ్రంగా ప్రవహిస్తుండడంతో అతి కష్టం మీద వాగు దాటి రెండు కిలోమీటర్ల కాలినడకన వెళ్లారు. గర్భినీకి నొప్పులు ఎక్కువ కావడాన్ని గమనించిన స్థానికులు వాగు ఒడ్డునే.. వర్షంలో గొడుగు కింద పురుడు పోసి తల్లిని బిడ్డను రక్షించారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారమిచ్చి ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏటా వర్షాకాలం వస్తే ఇదే పరిస్థతి ఏర్పాటుతోందని, వాగు దాటి ఆస్పత్రికి వెళ్లలేక రోగులు ప్రాణాలు కోల్పొతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు వేయించి వాగుపై వంతెన నిర్మించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.