Vegetable Vehicle fallen and theft video Viral : ఈ కష్టం పగోనికి కూడా రావద్దు నాయనా...!

By

Published : Aug 3, 2023, 3:02 PM IST

thumbnail

Vegetable Vehicle fallen Video Viral : ప్రస్తుతం బాగా నడుస్తున్న బిజినెస్ అంటే ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చే మాట కూరగాయల వ్యాపారం. గత కొంత కాలంగా పెరుగుతున్న కూరగాయర ధరలు కొందరి రైతులని కోట్లాధిపతులని చేశాయి. జీవితాలనే మార్చాయి. కానీ ఈ వ్యాపారస్థుడికి మాత్రం తీరని నష్టాన్ని బాధని మిగిల్చింది. ఇంతకి ఏమైందంటే....! కూరగాయలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఆ వాహనాన్ని బయటకు తీయగానే స్థానికులు గుంపులుగా వచ్చి అందులో ఉన్న కూరగాయలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్​ జిల్లా భైంసా మండలంలోని మాటేగాం గ్రామంలో కూరగాయలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాగులో పడింది.  డ్రైవర్​ సురక్షితంగా బయటపడ్డారన్నారు. కూరగాయల వాహనాన్ని క్రేన్​ సహాయంలో బయటకు తీసినట్లు వారు తెలిపారు. కాగా ఆ వాహనాన్ని బయటకు తీశారో లేదో అక్కడున్న జనం గుంపులుగుంపులుగా వచ్చి అందులో ఉన్న కూరగాయల్ని సంచుల్లో వేసుకొని వెళ్లారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.