Telangana Former AG Ramakrishna Reddy Interview about Chandrababu Arrest: "36 మంది బయట ఉన్నారు..37వ వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు?"

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 2:15 PM IST

thumbnail

Telangana Former AG Ramakrishna Reddy Interview about Chandrababu Arrest: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్​ (Chandrababu Arrest News Updates) రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోందని తెలంగాణ మాజీ ఏజీ రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది రెండేళ్ల క్రితం నమోదైన కేసు అని, రెండేళ్లలో 36 మందిపై అభియోగాలు మోపారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో 36 మంది బయట ఉండగా.. 37వ వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారన్నారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం సరికాదనేది తన అభిప్రాయమని అన్నారు. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం రాజకీయ దురుద్దేశంగానే కనిపిస్తున్నాయని, ఇప్పటివరకైతే ఈ కేసులో ఆధారాలేమీ లేవని, మోపిన ఆరోపణకు తగిన ఆధారాలు ఉంటేనే చర్యలకు అవకాశం ఉంటుందని  తెలిపారు.

AP Skill Development Case: రెండేళ్ల వ్యవధిలో ఏ ఆధారాలు సమర్పించకముందే అకస్మాత్తుగా చంద్రబాబును చేర్చడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. ఈ కేసులో కొంత మంది రిమాండ్‌ను కోర్టులు తిరస్కరించాయన్నారు. ఈ కేసులో కొంతమంది ముందస్తు బెయిల్‌ తీసుకున్నారు. ఈ కేసులో రెండేళ్ల క్రితం అరెస్టైన వారు ఏదో రూపంలో బయటే ఉన్నారని, ఇలాంటి సమయంలో చంద్రబాబుపై అభియోగం మోపడం సరైన నిర్ణయం కాదుని తెలిపారు. చంద్రబాబునాయుడు అరెస్టు నేపథ్యంలో తెలంగాణ మాజీ ఏజీ రామకృష్ణారెడ్డితో  ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.