షాపింగ్ మాల్‌లో కుప్పకూలిన లిఫ్ట్​, ఆరుగురికి గాయాలు - Lift Collapse in shopping mall

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 8:25 PM IST

thumbnail
షాపింగ్ మాల్‌లో కుప్పకూలిన లిఫ్ట్​- ఆరుగురికి గాయాలు- ఓవర్​ లోడ్​ వల్లే ప్రమాదం (ETV Bharat)

Lift Collapse in shopping mall At Sadashivpet  : సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని షాపింగ్​ మాల్​లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లిఫ్ట్​ కూలిపడింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే లిఫ్ట్​ తెగిపడటానికి కారణం ఓవర్​లోడ్​ అని తెలిసింది.  

ఇదీ జరిగింది : సదాశివపేట పట్టణంలోని ఓ ఫ్యాషన్​ షాపింగ్​ మాల్​లోని లిఫ్ట్​లో 16 మంది వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా లిఫ్ట్​ విరిగింది. ఒక్కసారిగా ఓవర్​లోడ్​ కావడంతో కేబుల్ తెగిపడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సంగారెడ్డి చరిత్ర ఆసుపత్రికి తరలించారు. వీరిలో ప్రస్తుతం ముగ్గురు క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. లిఫ్ట్​ తెగిపడటంతో అందులో ఉన్నవారు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఓవర్​ లోడ్​ వల్లే లిఫ్ట్​ కూలిపోయిందని మాల్​ నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లిఫ్ట్​లో ఒక్కసారిగా ఇలా జరగడం స్థానికంగా కలకలం రేపింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.